/rtv/media/media_files/2025/08/18/naveen-patnaik-2025-08-18-00-09-30.jpg)
naveen patnaik
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కొద్ది సేపటి క్రితం ఆస్పత్రిలో చేరారు. పెద్ద వయసుతో వచ్చిన అనారోగ్యాల కారణంగా ఆయన భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి నుంచి తనకు అసౌకర్యంగా ఉందని పట్నాయక్ చెప్పారు. దీంతో పలువురు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు అని నేతలు చెబుతున్నారు. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని.. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. నవీన్ పట్నాయక్ ఇటీవల ముంబయిలో సర్వికల్ ఆర్థరైటిస్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.