NHAI Offer: ఆ ఫొటో పంపిస్తే రూ.1000 ఫాస్టాగ్‌ ఫ్రీ.. వాహనదారులకు NHAI బంపరాఫర్!

టోల్ ప్లాజాలోని టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటే దాని ఫొటో పెట్టిన వారికి రూ.1000 రివార్డుగా వారి ఫాస్టాగ్ అకౌంట్‌లోకి రీఛార్జ్ చేస్తారు. 'రాజ్ మార్గ్ యాత్ర' అనే యాప్‌లో ఫొటోలు పోస్ట్ చేయడంతో పూర్తి వివరాలు తెలియజేస్తే మీకు రివార్డు వస్తుంది.

New Update
Fastag

Fastag

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఉంటాయి. వీటి దగ్గర పరిశుభ్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వ సంస్థ అయిన NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పబ్లిక్ ప్లేస్‌లు సాధారణంగా శుభ్రంగా ఉండవు. ముఖ్యంగా టాయిలెట్స్ అయితే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే NHAI ఓ నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని సమాచారం ఇచ్చే వారికి బహుమతి ఇవ్వనున్నట్లు NHAI ప్రకటించింది. టోల్ ప్లాజాలోని టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నట్లు ఉన్న ఫొటో పెడతారో వారికి రూ.1000 వరకు రివార్డుగా వారి ఫాస్టాగ్ అకౌంట్‌లోకి రీఛార్జ్ చేస్తారు.

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

టాయిలెట్స్ ఫొటో తీసి..

జాతీయ రహదారిపై ప్రయాణించే పౌరులు ఎవరైనా టోల్ ప్లాజా వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గమనిస్తే వెంటనే దానికి సంబంధించిన ఫోటోను తీయాలి. ఈ ఫోటోను 'రాజ్ మార్గ్ యాత్ర' (Raj Marg Yatra) అనే యాప్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫొటోతో పాటుగా, యూజర్లు వినియోగదారుడి పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు పంపాలి. అప్పుడు యూజర్ పంపిన ఫొటోను NHAI అధికారులు పరిశీలిస్తారు. ఆ ఫొటో అర్హత కలిగి ఉందని నిర్ధారించిన తర్వాత రూ. 1000 బహుమతిని వెంటనే ఆ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న ఫాస్టాగ్ అకౌంట్‌కు జమ చేస్తారు. అయితే NHAI నిర్వహించిన ఈ కొత్త కార్యక్రమం అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల టోల్ ప్లాజాలు పరిశుభ్రంగా ఉంటాయి. ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని NHAI  భావిస్తోంది.

ఇది కూడా చూడండి: BSNL Recharge Plan: రూ.99లకే బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదిరిపోయే ప్లాన్స్

Advertisment
తాజా కథనాలు