RBI: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు!

నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రైల్‌ టికెట్ అడ్వాన్స్‌ బుకింగ్‌ ను 60 రోజులకు ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీలను 3.75 శాతానికి పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.

author-image
By Bhavana
New Update
Indian Rupee : ఇండోనేషియాలో కూడా మన రూపాయి.. కుదిరిన ఎంవోయూ!

RBI: నేటి నుంచి డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్ ఫర్‌ , క్రెడిట్‌ కార్డులలో మార్పులు, ఎల్పీజీ సిలిండర్‌ ధరలలో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఏఏ దాని మీద నిబంధనలు అమలు చేయనుందో ఇప్పుడు చూద్దాం..

Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే


దేశీయ నగదు బదిలీ నియమం:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ వినియోగదారుల భద్రతను మరింత పెంచుకోవడానికి కొత్త దేశీయ నగదు బదిలీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ఇది నేటి నుండి అమలులోకి వస్తుంది. ఆర్బీఐ జులై 2024 సర్క్యులర్‌లో..’బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, ఫండ్ బదిలీల కోసం చెల్లింపు వ్యవస్థలలో పురోగతి.. కేవైసీ అవసరాలను తీర్చడం మొదలైన వాటిలో గణనీయమైన పెరుగుదల ఉందని పేర్కొంది

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లో కొత్త మార్పులు:


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్ కొత్త మార్పులను ప్రవేశపెట్టబోతోంది. దీని కింద అసురక్షిత ఎస్బీఐ  క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్స్ ఛార్జీ నెలకు 3.75%కి పెరుగనున్నట్లు సమాచారం. అదనంగా, బిల్లింగ్ వ్యవధిలో యూటిలిటీ చెల్లింపుల మొత్తం మొత్తం ₹50,000 మించి ఉంటే 1% ఛార్జీ వేసే అవకాశాలున్నాయి. ఇది 2024 డిసెంబర్ 1 నుండి అమలులోకి  రానుంది.

Also Read:  అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లలో  కూడా 


ఐసీఐసీఐ బ్యాంక్ దాని ఫీజు నిర్మాణం, క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లలో మార్పులు చేసింది. అందులో బీమా, కిరాణా షాపింగ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌చార్జ్ వంటి వాటిలో మినహాయింపులు, ఆలస్యమైన చెల్లింపు రుసుముల పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే ఇది మరో 15 రోజులు అంటే నవంబర్ 15 నుండి అమలులోకి వస్తుంది.

Also Read:  స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్డీ గడువు:

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టుబడి 2024 నవంబర్ 30 వరకు మాత్రమే.. ఇదే చివరి తేదీ. ఇండ్ సూపర్ 300 రోజుల వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్ సిటిజన్‌లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80%. ప్రత్యేకంగా 400 రోజుల పాటు, బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్‌లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.00% వడ్డీ రేట్లను కూడా అందించనుంది.

Also Read:  ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్

అడ్వాన్స్ రైలు టిక్కెట్ బుకింగ్:


అడ్వాన్స్ రైలు టిక్కెట్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. దీంతో ప్రయాణీకులు ఇప్పుడు 60 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్పి ఉంటుంది. ఈ ముందస్తు రిజర్వేషన్ వ్యవధి బయలుదేరే రోజు మినహాయింపు ఉంటుంది. ఇది 2024 నవంబర్ 1 నుండి అమల్లోకి రానుంది. అయితే ఇది ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి వర్తించదు.

ట్రాయ్‌ కొత్త నియమం:

స్పామ్, మోసాలను నిరోధించడానికి.. టెలికాం కంపెనీలు కొత్త నిబంధనల ప్రకారం మెసేజ్ ట్రేసబిలిటీని మొదలు పెట్టనున్నాయి. దీంతో పాటు లావాదేవీలు, ప్రచార సందేశాలు పర్యవేక్షించిడం జరుగుతుంది.

ఎల్పీజీ సిలిండర్ ధర:


నవంబర్ 1న ఎల్పీజీ సిలిండర్ ధరలు సవరించబడతాయి. ఇది దేశీయ వినియోగదారులు, వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు