Vijay Rashmika Marriage: మొత్తానికి ఒక్కటైన విజయ్- రష్మిక.. 117 రూమ్స్.. నో ఫోన్స్.. పెళ్లిలో రూల్స్ ఇవే!

ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో విజయ్- రష్మిక రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా వేడుక జరిగింది. తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

New Update
Vijay Rashmika Marriage

Vijay Rashmika Marriage

Vijay Rashmika Marriage: టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఎంతో ఆత్మీయంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

ఉదయం శుభ ముహూర్తాన మూడు ముళ్లు

ఉదయం 7:30 గంటలకు బరాత్ ప్రారంభమైంది. తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం 10:10 గంటలకు విజయ్, రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. మేళ తాళాల మధ్య ఈ వేడుక సాదాసీదాగా కానీ ఘనంగా జరిగింది.

రెండు సంప్రదాయాల్లో వివాహం

మొదట తెలుగు ఆచారాల ప్రకారం పెళ్లి జరిగింది. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయం అయిన కొడవ పద్ధతిలో మరోసారి వివాహం జరగనుంది. రష్మిక కర్ణాటకలోని కొడవ వర్గానికి చెందినవారు కావడంతో వారి సంప్రదాయాలను కూడా పాటించనున్నారు.

విలాసవంతమైన రిసార్ట్ లో పెళ్లి

ఈ పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ITC మెమెంటోస్ (ఎకాయా) హోటల్‌లో జరిగింది. ఈ రిసార్ట్‌లో సుమారు 117 గదులు, ప్రీమియం సూట్లు, ప్రైవేట్ విల్లాలు ఉన్నాయి. ఈ వేడుక కోసం దాదాపు రూ. 90 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.

అతిథుల ఫుల్ లిస్ట్ ఇదే

సుమారు 100 మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, శివ నిర్వాణ, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషిక రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వంటి పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా ఉత్సాహంగా జరిగాయి.

విందు భోజనం ప్రత్యేకం

అతిథుల కోసం తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక ప్రత్యేక బిసిబేళాబాత్, కొడవ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలు ఏర్పాటు చేశారు.

రష్మిక కుటుంబం

రష్మిక 1995 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాజీపేటలో జన్మించారు. ఆమె తండ్రి మదన్ మందన్న వ్యాపారవేత్త. తల్లి సుమన్ గృహిణి. ఆమెకు షిమన్ మందన్న అనే చెల్లి ఉంది. షిమన్ వయసు 14 ఏళ్లు. అక్కకంటే 16 ఏళ్లు చిన్నది కావడంతో రష్మిక ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటుంది.

ప్రేమ నుంచి పెళ్లి వరకు

2018లో విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్, రష్మిక కలిసి నటించారు. అక్కడ మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’తో వారి బంధం మరింత బలపడింది. కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఒకే చోట ఫొటోలు కనిపించడం వంటి విషయాలు అప్పట్లో వార్తల్లో నిలిచాయి.

ఏడేళ్ల ప్రేమ తర్వాత, ఏడడుగులు వేసి ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, వీరి మధ్య వయసు తేడా కూడా ఏడేళ్లే.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

వివాహం అనంతరం మార్చి 4న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఉదయ్‌పూర్ అరవళ్ల కొండల మధ్య జరిగిన ఈ పెళ్లి అభిమానుల్లో ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు ‘విరోష్’ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Advertisment
తాజా కథనాలు