మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను సపోర్ట్ చేసే ఎవరినైనా తాము హత్య చేస్తామని ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో కూడా హెచ్చరిస్తూ పోస్టు చేసింది. ఇలాంటి తరుణంలో ఆ గ్యాంగ్‌స్టర్ పేరును ప్రస్తావిస్తూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్స్ట్రాగ్రాంలో ఓ మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరలవుతోంది.
Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి
'' నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైల్లో ఉండి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని నాకు తెలిసింది. మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి. రాజస్థాన్ నాకు ఇష్టమైన ప్రదేశం. ముందుగా మీతో జూమ్ కాల్లో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మండి. అంతా మీ మంచికోసమే. మీ మొబైల్ నంబర్ ఇస్తే సంతోషిస్తాను'' అని సోమీ అలీ రాసుకొచ్చారు. బిష్ణోయ్ ఫొటను కూడా షేర్ చేయడంతో ఈ పోస్టు వైరలవుతోంది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ జైల్లో ఉన్నాడు.
Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు
సల్మాన్ మాజీ ప్రేయసీ సోమి అలీ గతంలో కూడా ఆయనపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. సల్మాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన అమ్మాయిల్ని కొట్టేవాడు అంటూ పేర్కొన్నారు. ఇకనైనా ఆయన్ని అభిమానించడం ఆపండని.. అతనొక శాడిస్ట్ అని, మానసిక రోగి, ఈ విషయం మీ ఎవరికీ తెలియదు అని తెలిపారు. అయితే ఈ పోస్టు వైరల్ కావడంతో తర్వాత దాన్ని డిలీట్ చేశారు.
Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!
సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి. ఈమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. మాఫియా, ఆందోళన్ చిత్రాలతో ఆమెకు గుర్తింపు వచ్చింది. సల్మాన్ ఖాన్‌తో కూడా సోమీ ప్రధాన పాత్రల్లో గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. కానీ షూటింగ్లో ఉండగానే ఈ సినిమా ఆగిపోయింది. ఈ షూటింగ్‌లోనే సోమీ- సల్మాన్ ప్రేమలో పడ్డట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సల్మాన్ నాకెంతో ఇష్టమని, నా ప్రేమని తెలియజేశానని కూడా ఆమె చెప్పారు. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ వీడిపోయారు.
Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!