BIG BREAKING: 'ప్రధాని మోదీని చంపుతాం!'

ప్రధాని మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు మెసేజ్‌ రావడం కలకలం రేపింది. మోదీని బాంబు పెట్టి లేపేస్తామని ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో ఓ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

New Update
MODI

PM Modi: ప్రధాని మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు మెసేజ్‌ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీశారు. ఈ మెసేజ్ రాజస్థాన్‌లోని అజ్మీర్‌ ప్రాంతం నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ బృందాన్ని పంపినట్లు ఓ అధికారి  తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..!

మద్యం మత్తులో..

ఓ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్‌కు వచ్చిన వాట్సాప్ సందేశంలో ఇద్దరు ఐఎస్‌ఐ ఏజెంట్లు.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడుకు ప్లాన్ చేశారని పేర్కొన్నట్లు చెప్పారు. పంపిన వ్యక్తి మానసిక క్షోభకు గురైన వ్యక్తి లేదా మద్యం మత్తులో ఉండి ఆ మెసేజ్ చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నామన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసినట్లు వెల్లడించారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్‌కు గతంలో కూడా చాలాసార్లు ఫేక్ బెదిరింపు సందేశాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!

ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు