హనుమంతుడే పంపాడేమో.. కామాంధుడి నుంచి బాలికను కాపాడిన కోతులు! యూపీలోని బాగ్‌పత్‌లో ఓ యువకుడు 6 ఏళ్ల బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇంతలో ఆ ఆంజనేయుడే పంపాడన్నట్టుగా అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చి అతనిపై దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. By Vijaya Nimma 29 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి National : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో వింత ఘటన వెలుగు చూసింది. అంతేకాకుండా అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఆరేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఓ యువకుడు తనతో పాటు తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుండగా ఒక్కసారిగా ఆ దేవుడే పంపినట్టు అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చింది. ఒక్కసారిగా యువకుడిపై దాడి చేశాయి. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా బాలికను ఆ వానరాలు కాపాడాయి. నిందితుడిపై పోక్సో కేసు: ఆ తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి యువకుడిపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ బయటికి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సీసీటీవీలో బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు: సింఘావలీ అహిర్‌లోని డోలా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీసీటీవీలో బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు నిందితుడిని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తండ్రి మాట్లాడుతూ సమయానికి వానరాలు అక్కడికి రాకపోతే చిన్నారి ఏమయ్యేదో అంటూ బోరున విలపించాడు. ఆ ఆంజనేయుడే వాటిని అక్కడికి పంపాడని కృతజ్ఞతలు తెలిపాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికులు సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా భగవంతుడి లీలే అంటూ మాట్లాడుకుంటున్నారు. Also Read : నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు #uttar-pradesh #kidnap #monkeys మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి