/rtv/media/media_files/2026/02/26/minor-student-gives-birth-2026-02-26-07-47-20.jpg)
మధ్యప్రదేశ్ టెన్త్ బోర్డు ఎగ్జామ్స్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్‌రూమ్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన రెండు రోజు క్రితం జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన ఓ బాలిక, మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్‌లోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి గణితం పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే సదరు విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. నొప్పి భరించలేక ఆమె ఇన్విజిలేటర్‌ను అడిగి వాష్‌రూమ్‌కు వెళ్లింది.
ఎంతసేపు అయినా విద్యార్థిని తిగిరి పరీక్షా హాలుకు రాకపోవడంతో అక్కడి సిబ్బందికి అనుమానం కలిగింది. సరిగ్గా అదే సమయంలో వాష్‌రూమ్ లోపలి నుండి పసికందు ఏడుపు వినిపించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మహిళా సిబ్బంది తలుపులు తెరిచి చూడగా, ఆ అమ్మాయి ప్రసవించి ఉండటం చూసి వారందరూ షాక్ అయ్యారు. ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తల్లీబిడ్డలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అధికారుల విచారణ
పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన విషయం పాఠశాల యాజమాన్యానికి కానీ, కనీసం తోటి విద్యార్థులకు కానీ తెలియకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మైనర్ బాలిక గర్భం దాల్చడం వెనుక ఏదైనా లైంగిక వేధింపులు ఉన్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Follow Us