బాబా సిద్ధిఖీహత్య కేసులో ట్విస్ట్..మైనర్ అనే అనుమానాలు

ఎన్సీపీనేత బాబా సిద్ధిఖీ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఒకరు మైనర్ అని తెలుస్తోంది.  నిర్ధారణ చేసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టు బోన్ అసిఫికేషన్ టెస్ట్ కు ఆదేశించింది. 

New Update
murder

Siddique Muder Accused: 

ముంబైలోని బాంద్రా లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ- అజిత్​ పవార్​ వర్గం) నేత బాబా సిద్ధిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హిందీ చిత్ర పరిశ్రమతో కూడా సంబంధాలున్న హై-ప్రొఫైల్ పొలిటీషియన్ సిద్ధిఖీని విజయ దశమి రోజున గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ చెప్పారు. వారిలో ఒకరు యూపీకి చెందినవారు కాగా, మరొకరు హర్యానాకు చెందినవారు. మూడో దుండగుడు పరారీలోఉన్నట్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే తెలిపారు.

వీరి మీద మహారాష్ట్ర ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ కూడా చేపట్టింది. అయితే ఇందులో ఈ కేసులో నిందితుల్లో ఒకరై ధరమ్ రాజేష్ కశ్యప్ తాను మైనర్‌ని అని చెప్పడం వివాదంగా మారింది. ధరమ్ తన వయసు 17 ఏళ్లు అని కోర్టులో చెప్పాడు. మరోవైపు దీనిని ప్రాసిక్యూషన్ తోసిపుచ్చుతూ.. అతను 2003లో జన్మించాడని కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు నిందితుడికి బోన్ అసిఫికేషన్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. శరీరంలోని కొన్ని ఎముకల ఎక్స్-రేని పరిశీలించడం ద్వారా వ్యక్తి వయసుని అంచనా వేయడాన్ని బోన్ అసిఫికేషన్ టెస్ట్‌ అంటారు. దీని బట్టి వ్యక్తి వయసును నిర్ధారించవచ్చును . ఇక మరో నిందితుడు గుర్‌మైల్ సింగ్ కి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. ఇద్దరు నిందితులను ఈరోజు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 

ఇక సిద్ధఖీ హత్య తామే చేయించామని లారెన్స్ బిష్ఱోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ ఫిగర్లు దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌లతో సిద్ధిఖీకి ఉన్న సన్నిహితం వల్ల ఈ హత్య చేశామని గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాటూ సల్మాన్ ఖాన్‌కు సహకరిస్తే..ఎవరైనా చావాల్సిందే అంటున్నారు. సిద్దిఖీకి పట్టిన గతే వారికీ పడుతుందని అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన శుభమ్ రామేశ్వర్ లోంకర్‌ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్నందునే సిద్ధిక్ హత్యకు గురయ్యాడని, సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నాడని పోస్టులో రాశాడు. అలాగే సల్మాన్ ఇంటి బయటి కాల్పుల నిందితుడు అనూజ్ థాపన్ పోలీస్ కస్టడీలో మరణించిన విషయాన్ని కూడా తన పోస్ట్‌లో ప్రస్తావించాడు లోంకర్. అనూజ్‌ను పోలీసలు జైల్లో చిత్రహింసలు పెట్టారని...అతని కుటుంబ సభ్యులను కూడా హింసించారని లోంకర్ తన పోస్ట్‌లో ప్రస్తావించాడు. 

Also Read: Hyderabad: హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పై కేసు నమోదు

Advertisment
Advertisment
తాజా కథనాలు