Hyderabad: హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పై కేసు నమోదు

హైదరాబద్ మేయర్ విజయలక్ష్మి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల సందర్భంలో టైమ్ దాటిన తర్వాత కూడా పెద్ద సౌండ్‌తో డీజే ప్లే చేశారు..ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 

New Update
hyd

Case On Mayor Vijaya Laxmi: 

ఈనెల 10న బంజారాహిల్స్‌లో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సాయంత్రం మొదలైన ఈ సంబరాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. అయితే ఇందులో భాగంగా రాత్రి 11.45 తరువాత కూడా పెద్ద సౌండ్స్‌తో డీజే పెట్టారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ మేయర్ వేదికపై  ప్రసంగించడమే కాకుండా జానపద నృత్యం కూడా చేశారు.  ఈ విషయంలో ఆ రోజే గొడవ అయింది. స్థానిక పోలీసులు దీనిని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారు. కానీ మేయర్ విజయలక్ష్మి మహిళలు చేసుకునే బతుకమ్మను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. 

ఇప్పుడు తాజాగా ఈరోజు బంజారాహిల్స్ పోలీసులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీద కేసు నమోదు చేశారు. నిర్దేశిత నమయం దాటాక కూడా పెద్ద సౌండ్‌తో డీజే పెట్టారని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. మేయర్‌‌తో పాటూ కార్యక్రమ నిర్వాహకుడు విజయ్‌కుమార్‌, డీజే సౌండ్స్‌ నిర్వాహకుడు గౌస్‌ ల మీద కేసు నమోదు అయింది. పోలీసులు సుమోటోగా ఈ కేసుఉ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్థానికులు కూడా కొంతమంది ఈ విషయం మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మతపరమైన కార్యక్రమాల సమయంలో డీజేలు, బాణసంచా వాడకాన్ని ఈమధ్యనే హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. సౌండ్ సిస్టమ్‌లు అనుమతించినా తప్పనిసరిగా అధికారులు సూచించిన డెసిబెల్స్ లోబడే ఉండాలి. అదికూడా నిర్దేశిత సమయం వరకే అని రూల్స్ పెట్టారు. 

Also Read: USA: అతి పెద్ద రాకెట్..స్టార్ షిప్ ప్రయోగం విజయవంతం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు