BREAKING: మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం డీడీ లాపాంగ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం రాత్రి అతను మృతి చెందారు. లాపాంగ్  1992- నుంచి 2010 వరకు మొత్తం 4 సార్లు సీఎంగా పనిచేశారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

మేఘాలయ మాజీ సీఎం డీడీ లాపాంగ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం రాత్రి అతను మృతి చెందారు. లాపాంగ్  1992- నుంచి 2010 వరకు మొత్తం 4 సార్లు సీఎంగా పనిచేశారు. మొదట స్వతంత్ర  అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత లాపాంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: పాక్ దంపతులకు జమ్మూకశ్మీర్‌ హైకోర్టు మాస్ వార్నింగ్

నాలుగు దశాబ్దాల నుంచి..

లాపాంగ్ మేఘాలయలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని ఒక సామాన్య రోడ్డు కార్మికుడిగా ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. లాపాంగ్ 1972లో స్వతంత్ర అభ్యర్థిగా నొంగ్‌పో నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దానిలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే 2018లో పార్టీలో సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రిగా 1992-93, 2003-06, 2007-08, 2009-10 మధ్య కాలంలో వివిధ సార్లు బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణం పట్ల రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. మేఘాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని, మరణం మేఘాలయ రాజకీయాలకు ఒక తీరని లోటు అని పలువురు అంటున్నారు.

ఇది కూడా చూడండి: PM Modi : మోదీ మణిపూర్ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!

Advertisment
తాజా కథనాలు