కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో యూపీఏ కూటమి 2004 పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ సాధించింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీనే ప్రధానమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. అయితే ఆమె విదేశీయురాలనే కారణంగా ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ వ్యతిరేఖించారు. అనూహ్యంగా 2009 ప్రధానమంత్రి పగ్గాలు డా. మన్ మోహన్ సింగ్‌కు అప్పగించారు. అప్పటికే ఆయన 2004 నుంచి 2009 వరకు ప్రధానిగా పని చేసి దేశ ఆర్థక వ్యవస్థను చక్కబెట్టారు.
Also Read: Manmohan Singh: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...
Also Read: Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులైన ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం కాదని మన్ మోహన్ సింగ్‌కే పాలనా పగ్గాలు అప్పగించింది అప్పటి యూపీఏ కూటమి. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా అప్పటి దాకా ప్రధాని పధవిలో ఉన్న ఆయన్ను పల్లెత్తు మాట కూడా ఎవరూ అనలేదు. ప్రైమ్ మినిస్టర్ ఛైర్‌లో ఉన్నంతకాలం ఆయన ప్రజా సంక్షేమం మరవలేదు. ఆర్థిక సంస్కరణలు, ఉపాధి హామి పథకం మన్ మోహన్ సింగ్‌కు బాగా పేరు తెచ్చాయి.
Also Read: Manmohan: గొప్ప ఆర్ధికవేత్త, మౌనముని మన్మోహన్ సింగ్