కోలకత్తా (Kolkata) ఆర్జీ కర్ ఆసుపత్రి లో ట్రైనీ డాక్టర్ రేప్, హత్య జరిగిన దగ్గర నుంచీ అక్కడ జూనియర్ డాక్టర్లు నిరసనలు చేస్తున్నారు. తమ విధుల్లోకి వెళ్ళకుండా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు విధుల్లోకి వెళ్ళమని భీష్మించుకుని కూర్చొన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా పట్టువదల్లేదు. దీని మీద బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జూడాలను ముఖ్యమంత్రి మమతా దీదీ చర్చలకు ఆహ్వానించారు. నాలుగు సార్లు వారితో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. లాస్ట్ టైమ్ దీదీనే స్వయంగా వచ్చి మాట్లాడ్డానికి ప్రయత్నించారు. అయితే అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి.
Also Read : గణేష్ ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ అక్కడిక్కడే..!
Mamata Banerjee
ఇప్పుడు ఈరోజు మమతా (Mamata Banerjee) దీదీ మరోసారి జూడాలను చర్చలకు ఆహ్వానించారు. కానీ డాక్టర్లు మాత్రం చర్చలు నిరాకరించారు. దీంతో సోమవారం ఐదోసారి.. ఇదే చివరి ఆహ్వానం అంటూ జూడాలకు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ చర్చలకు ఆహ్వానించారు. మరికొద్ది సేటిలో కాళీఘాట్‌లో తన నివాసంలో సమావేశానికి రావాలని మమత పిలిచారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లు ఓపెన్ మైండ్‌తో చర్చలకు రావాలని కోరారు. అయితే ఈ సమావేశం లైవ్ స్ట్రీమింగ్ మాత్రం కాదు. చర్చలు ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. అలాగే సమావేశం యొక్క మినిట్స్ మాత్రం రికార్డ్ చేయబడతాయని వెల్లడించారు. ఇరు పక్షాల నుంచి సంతకాలు చేయబడతామని స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్. అయితే జూడాలు మాత్రం లైవ్ టెలీకాస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు.
చర్చలకు ఇదే చివరి ఆహ్వానం అని ప్రభుత్వం చెబుతోంది. దీనికి జూడాలు సహకరించకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూడాలి. దాదాపు నెలరోజులకు పైగా డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. కోలకత్తాలోని రోగులు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఒకవేళ జూడాలు చర్చలకు రాకపోతే బెంగాల్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : హీరో సిద్దార్థ్ - అదితి పెళ్లి ఫొటోలు వైరల్!