రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన

సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Mamata Resign

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ హత్యాచార ఘటనపై మమతా సర్కార్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆందోళన లేదని.. ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యురాలి ఘటన హత్యాచార ఘటనపై ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, జూనియర్ వైద్యలకు మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 

Also Read: సీతారం ఏచూరి జీవితంలో 10 ముఖ్యమైన అంశాలు

మూడు రోజులుగా డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలకు హాజరు కావడం లేదు. ఈ చర్చలను ప్రత్యక్షప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. న్యాయం కోసం తాను రాజీనామాకైనా సిద్ధమే అని సీఎం మమతా ప్రకటించడంతో బెంగాల్‌లో రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

” వైద్యులతో సమావేశం అయ్యేందుకు గురువారం దాదాపు రెండు గంటల పాటు ఎదురుచాశం. అయినప్పటికీ వారి నుంచి స్పందన రాలేదు. జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్లుగా చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. సుప్రీంకోర్టు పర్మిషన్‌తో ఆ ఫుటేజీని వైద్యులకు అందిస్తాం. చర్చలు జరిపేందుకు ఇప్పటివరకు మూడుసార్లు ప్రయత్నించాం. వైద్యులు తమ విధులకు దురంగా ఉండటం వల్ల రాష్ట్రంలో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. ఆందోళన చేస్తున్న వైద్యలపై చర్యలు తీసుకోము. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తామని” సీఎం మమతా బెనర్జీ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు