/rtv/media/media_files/2026/01/18/maoist-2026-01-18-19-33-57.jpg)
Maoist
Jharkhand : జార్ఖంఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలు మరణించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ లోని సరంద అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కి చెందిన 10 మంది మావోయిస్టులు మరణించినట్లు భద్రతాదళాలు తెలిపాయి. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతాదళాలు పెద్దసంఖ్యలో మారణాయుధాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us