BIG BREAKING: సీఎం సిద్ధరామయ్యపై హత్యా ఆరోపణలు.. కేసు నమోదు ?

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 24 హత్యలు చేశారని ఇటీవల మహేష్ శెట్టి తిమరోడి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే హోంమంత్రి డా. జి.పరమేశ్వర్‌ మహేష్ శెట్టిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు.

New Update
CM Siddaramaiah

CM Siddaramaiah

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 24 హత్యలు చేశారని మహేష్ శెట్టి తిమరోడి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే హోంమంత్రి డా. జి.పరమేశ్వర్‌.. మహేష్ శెట్టిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు మహేష్ శెట్టిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరువు నష్టం ఆరోపణలపై బీఎన్‌ఎస్‌ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. 

ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. మహేష్ శెట్టి తిమరోడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంతకాలంగా మహేష్ శెట్టి ముఖ్యమంత్రులపై ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడని.. గతంలో కాంగ్రెస్ కీలక నేతలపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని మండిపడ్డారు. 

Advertisment
తాజా కథనాలు