Srikanth Bharat Sensational Comments On Gandhi:  మహాత్మా గాంధీ మహాత్ముడు కాదు...జాతిపితకాదు..నటుడు శ్రీకాంత్‌ భరత్ సంచలన వ్యాఖ్యలు

హాత్మాగాంధీ అసలు మహాత్ముడు కాదని ఆయన ఎంతోమందిని లైంగికంగా వేధించాడని సినీనటుడు శ్రీకాంత్‌ భరత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గాంధీ జయంతి సందర్భంగా తాను విడుదల చేసిన ఓ వీడియోకు నెటిజన్ల రియాక్షన్‌పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.  

New Update
Tollywood Srikanth Bharat Sensational Comments On Gandhi

Tollywood Srikanth Bharat Sensational Comments On Gandhi

Srikanth Bharat Sensational Comments On Gandhi: మహాత్మాగాంధీ అసలు మహాత్ముడు కాదని ఆయన ఎంతోమందిని లైంగికంగా వేధించాడని సినీనటుడు శ్రీకాంత్‌ భరత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గాంధీ జయంతి సందర్భంగా తాను విడుదల చేసిన ఓ వీడియోకు నెటిజన్ల రియాక్షన్‌పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.  సెల్పీ వీడియో విడుదల చేసిన ఆయన గాంధీపై అనేక ఆరోపణలు చేశారు.  ఆయన మహాత్ముడా ..?  సాతంత్య్రం ఆయన తేలేదు.-- సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్‌ లాంటి వాళ్లు తెచ్చారు -అంటూ శ్రీకాంత్‌ భరత్‌ ఆరోపించారు.-- ఆయన జాతి పితకాదంటూ శ్రీకాంత్‌ చెప్పుకొచ్చారు. -- గాంధీ జయంతి రోజు కూడా శ్రీకాంత్ భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  బట్టతల పెట్టుకొని కరెన్సీ నోట్లపై ఉంటాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.  


ఆయన ఏమన్నారంటే...
తాను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్స్ వస్తాయని అయితే వేటినీ పెద్దగా పట్టించుకోనని వీడియోలో చెప్పారు నటుడు శ్రీకాంత్ భరత్. 'అక్టోబర్ 2 గురించి పోస్ట్ పెడితే కొందరు తీవ్రంగా విమర్శించారు. మీకేం తెలుసురా? గాంధీ ఎంతోమందిని లైంగికంగా వేధించాడు. వాడు మహాత్ముడా?. ఆత్ముడు. స్వాతంత్ర్యం ఆయన తేలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు తీసుకొచ్చారు. వాళ్లు పరమాత్ములు. ఆయన జాతిపిత కాదు. భరతమాత అనే వ్యక్తులం మేము. జాతిపిత ఏంటి జాతిపిత. గాంధీ మహాత్ముడే కాదు.' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఇటీవల  గాంధీ మహాత్ముడే కాదంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.

కాగా ప్రస్తుతం  శ్రీకాంత్‌ భరత్ కూడా గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివదానికి కారణమైంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది... నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గాంధీపై అసభ్యకర కామెంట్స్ చేసిన నటుడిపై ఫైర్ అవుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. కొంతమంది ఇది ఓల్డ్ వీడియో అని ఆయన ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా గాంధీపై అలా కామెంట్స్ చేయడం సరి కాదని అంటున్నారు. శ్రీకాంత్ భరత్ తెలుగులో పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్, కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read :  ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?

Advertisment
తాజా కథనాలు