Minister Manikrao Kokate: ఇదేందయ్యా.. అసెంబ్లీలో మినిస్టర్ రమ్మీ గేమ్.. కట్ చేస్తే క్రీడా శాఖ పదవి ఇచ్చిన ప్రభుత్వం

మహారాష్ట్రకు చెందిన క్రీడా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే అసెంబ్లీలో రమ్మీ ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం అతన్ని వ్యవసాయ మంత్రి పదవి నుంచి తొలగించి, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధత్యలు అప్పగించారు.

New Update
Minister Manikrao Kokate

Minister Manikrao Kokate

అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల మహారాష్ట్రకు చెందిన క్రీడా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే రమ్మీ ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం అతన్ని వ్యవసాయ మంత్రి పదవి నుంచి తొలగించి, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధత్యలు అప్పగించారు. ప్రస్తుతం క్రీడామంత్రిగా ఉన్న దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: PM Kisan Samman Scheme : రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు విడుదల

అసలు ఏమైందంటే?

శాసన మండలి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి హాజరైన క్రీడా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే ఆ సమయంలో తన ఫోన్‌లో రమ్మీ ఆడారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్సీపీ నాయకులు రోహిత్ పవార్, జితేంద్ర అవ్హాద్ సోషల్ మీడియాలో వీటిని షేర్ చేశారు. రోజుకు రాష్ట్రంలో 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా వ్యవసాయ మంత్రి మాణిక్‌రావు సమావేశాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లు ఆడుతున్నారని వీడియోలు రిలీజ్ చేశారు. దీంతో కోకాటేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఇతని మంత్రి పదవిని తొలగించాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం కోకాటేపై వేటు విధించింది. వ్యవసాయ మంత్రి పదవి బాధ్యతలను తొలగించింది.

సమావేశం నిర్వహించి..
కోకాటే రమ్మీ ఆడలేదని, ఫోన్‌లో ఒక పాప్ అప్ ప్రకటన వచ్చిందని, దాన్ని మూసి వేయడానికి ఓపెన్ చేశానని ఆరోపణలను ఖండించారు. ఈ గొడవ తర్వాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మధ్య ఓ సమావేశం జరిగింది. దీని తర్వాత పదవి నుంచి కోకాటేను తొలగించారు. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుని కొకాటేను పదవి నుంచి తొలగించి వ్యవసాయ మంత్రి బాధ్యతలను దత్తాత్రేయ భరణెకు అప్పగించారు.

కోకాటేకు కొత్తేం కాదు..
మాణిక్‌రావ్ కోకాటే వివాదంలో చిక్కుకోవడం ఇదేం ఫస్ట్ కాదు. గతంలో కూడా ఇలానే ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పంటల బీమా పథకాన్ని అడుక్కునే వారితో గతంలో పోల్చారు. వీటిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

జైలు శిక్ష కూడా..
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అవినీతి ఆరోపణలు రావడంతో నాసిక్ కోర్టు కోకాటేకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ పథకాలలో అవకతవకలు జరిగాయని అతనే స్వయంగా ఒప్పుకున్నారు.

ఇది కూడా చూడండి: Rohingyas: భారత్‌లో రోహింగ్యాలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు