Maharashtra Election Date 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు నిర్వహించి 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఝార్ఖండ్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 13న ఫస్ట్ ఫేజ్, 20న సెకండ్ ఫేజ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను సైతం నవంబర్ 23న విడుదల చేయనుంది. మహారాష్ట్రాలో మొత్తం 288, ఝార్ఖండ్ లో 81 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 5తో ఝార్ఖండ్ అసెంబ్లీకి, నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగియనుంది.
ఇది కూడా చదవండి: జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా ఒమార్ అబ్దుల్లా ప్రమాణం.. ఎప్పుడంటే ?
మహారాష్ట్ర ఎన్నికలు-ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 20
నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 29
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 4
ఎన్నికలు: నవంబర్ 20
కౌంటింగ్: నవంబర్ 23
ఝార్ఖండ్ ఎన్నికలు-ముఖ్యమైన తేదీలు:
ఫేజ్ 1:
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 18
నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 25
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 28
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 30
ఎన్నికలు: నవంబర్ 13
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
ఫేజ్ 2:
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 29
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 1
ఎన్నికలు: నవంబర్ 20
కౌంటింగ్: నవంబర్ 23
ఫలితాలు: నవంబర్ 25
ఇది కూడా చదవండి: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్!
మహారాష్ట్ర.. 288 స్థానాలు, 9 కోట్ల మంది ఓటర్లు..
ఈ రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 234 జనరల్ సీట్లు ఉన్నాయి. ఇంకా.. ఎస్టీ రిజర్వ్డ్ 25, ఎస్సీ రిజర్వ్‌డ్ 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఇంకా ఓటర్ల విషయానికి వస్తే.. మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 4.97 కోట్ల మంది పురుషులు కాగా.. 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు మొత్తం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: CM Revanth: అపోహలొద్దు.. అన్యాయం జరగదు: వారికి సీఎం రేవంత్ భరోసా!
ఝార్ఖండ్.. 81 స్థానాలు.. 2.6 కోట్ల ఓటర్లు..
ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 44 జనరల్ కు కేటాయించారు. ఎస్టీ రిజర్వ్డ్ 28, ఎస్సీ 9 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 1.29 కోట్లు కాగా.. పరుషులు మరో 1.31 కోట్ల మంది ఉన్నారు.