Crime News: బాలుడితో యజమాని హోమో సెక్స్.. ఆ భయంతో ముక్కలుగా నరికి, షాపులోనే పాతిపెట్టి!

మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఓ దారుణమైన హత్యా ఘటనను పోలీసులు ఛేదించారు. 2020లో అదృశ్యమైన 17 ఏళ్ల బాలుడు షోయబ్‌ను కిరాణా షాపు నడుపుతున్న మౌలానా గులామ్ రబ్బానీ హత్య చేసి, అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి దుకాణంలోనే పాతిపెట్టినట్టు వెల్లడైంది.

New Update
Kotla Vemareddy: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ఆకస్మిక మృతి!

Maharashtra Crime News

Crime News: మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఓ దారుణమైన హత్యా ఘటనను పోలీసులు దాదాపు అయిదేళ్ల తరువాత ఛేదించారు. 2020లో అదృశ్యమైన 17 ఏళ్ల బాలుడు షోయబ్‌ను స్థానికంగా కిరాణా షాపు నడుపుతున్న మౌలానా గులామ్ రబ్బానీ హత్య చేసి, అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి తనే నిర్వహిస్తున్న దుకాణంలోనే పాతిపెట్టినట్టు వెల్లడైంది. భివండీలోని నెహ్రూనగర్‌కు చెందిన షోయబ్‌ తన కుటుంబంలో ఏకైక అబ్బాయి. అతడి కుటుంబం పోలీసులను ఆశ్రయించి, మిస్సింగ్‌ కేసు నమోదు చేయించింది. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగలేదు.

కదలికలపై నిఘా..

రెండేళ్ల తర్వాత రబ్బానీపై అనుమానాలు తలెత్తాయి. విచారణ నిమిత్తం అతన్ని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించగా.. అప్పటికే అతను పరారయ్యాడు. మహారాష్ట్ర నుంచి పారిపోయిన రబ్బానీ ఉత్తరాఖండ్‌లో ఓ మసీదులో తలదాచుకున్నాడు. అక్కడ కూడా అతని వ్యవహార శైలి మీద అనుమానాలు వచ్చాయి. ఓ స్థానికుడితో గొడవ పడ్డ ఘటన తరువాత ఉత్తరాఖండ్‌ పోలీసులు అతని కదలికలపై నిఘా పెట్టి, చివరికి అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: ఏసీ వాడేప్పుడు ఇలా చేస్తే కరెంట్‌ బిల్లు వందల్లోనే వస్తుంది

రబ్బానీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిర్వహించగా.. షోయబ్‌ను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. విచారణలో రబ్బానీ షోయబ్‌ను ఎందుకు హత్య చేశాడో కూడా వివరించాడు. తన దుకాణంలో పని చేసే ఓ బాలుడితో అతనికి లైంగిక సంబంధం ఉండగా.. ఆ విషయం షోయబ్‌ గమనించినట్లు చెప్పాడు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో.. మరింతగా అవమానంగా భావించి షోయబ్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి షాపులోనే ఒక ప్రదేశంలో పాతిపెట్టినట్లు వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: బెంగళూరులో భయపెడుతున్న పింక్‌ ఐ..ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

Advertisment
తాజా కథనాలు