ప్రేమలో మునిగిపోయిన కొందరు హద్దులు దాటి ఉంటారు. ఉదాహరణకు ముద్దులు, హగ్‌లు రిలేషన్‌లో ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏదైనా గొడవ వచ్చి విడిపోతే లైంగిక వైధింపులకు పాల్పడ్డారని కేసు వేస్తారు. ఇలాంటి కేసులను ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలపై వేస్తుంటారు. ఇదే సమస్యను ఎదుర్కొంటున్న ఓ యువకుడి కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!
ప్రేమను నేరంగా పరిగణించలేమని..
ఓ యువతితో ప్రేమలో ఉన్న వ్యక్తి తనని ముద్దు పెట్టుకున్నడాని, హగ్ చేసుకున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రేమలో ఉన్నప్పుడు యువతి, యువకుడు మధ్య శారీరక సంబంధం అనేది ఇద్దరి మధ్య ఇష్టంతోనే జరిగేదని, ప్రేమలో ఉన్నప్పుడు ముద్దులు, హగ్‌లు అనేవి సహజమని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు నిచ్చింది. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.
ది కూడా చూడండి: అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త క్లైమేట్ ఫైనాన్స్..
పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకోవడం, లైంగికంగా మోసం చేయడం వంటివి నేరంగా పరిగణిస్తారని తెలిపింది. ప్రేమలో ఇద్దరూ ఇష్టపూర్వకంగానే కలిశారని, టీనేజ్ ప్రేమల్లో హగ్‌లు, కిస్‌లు సహజమని తెలిపింది. ఇద్దరూ ఏకాభిప్రాయంతో రిలేషన్ పెట్టుకుని ఆ తర్వాత ఇలా కేసులు వేయడం కరెక్ట్ కాదని కోర్టు తెలిపింది.
ఇది కూడా చూడండి: Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్
ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ప్రేమించుకున్నప్పుడు క్లోజ్‌గా ఉండటం, ఆ తర్వాత లైంగిక వైధింపులు అని కేసులు పెడుతున్నారు. దీనివల్ల చాలా మంది అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మద్రాసు హైకోర్టు ఆలోచించి తీర్పునిచ్చింది. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల ప్రేమను నేరంగా పరిగణించలేమని హైకోర్టు తెలిపింది.
ఇది కూడా చూడండి: Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి