/rtv/media/media_files/2024/11/07/up66aWJxix1w1NjWz0BK.jpg)
మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది జూన్ లో ఈడీ మల్లారెడ్డికి సంబంధించా కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్ లను సీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సోదాల్లో మల్లారెడ్డి కాలేజీల్లో ఆర్థిక అవకతవకలను గుర్తించనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే.. నోటీసుల్లో ఈడీ ఏ విషయాలను పేర్కొంది? తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.