GSTపై చిరువ్యాపారుల నిరసన.. UPI పేమెంట్స్ బ్యాన్

కర్ణాటకలో చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. జీఎస్టీ అధికారులు తమను టార్గెట్ చేసుకొని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఈ ఆందోళన చేపడుతున్నారు.

New Update
popcorn

popcorn Photograph: (popcorn )

కర్ణాటకలో చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. జీఎస్టీ అధికారులు తమను టార్గెట్ చేసుకొని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఈ ఆందోళన చేపడుతున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు పంపుతుంది. కర్ణాటకలో దుకాణాదారులు బ్లాక్‌ బ్యాండ్‌లను ధరించి నిసరన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి కానీ.. బేకరీ, చిరు దుకాణాల కౌంటర్లలో నిరసనల ప్రభావం కనిపిస్తోంది. తమ అసమ్మతి తెలియజేసేలా ట్రేడర్లు బ్లాక్‌ టీ, బ్లాక్‌ కాఫీని మాత్రమే అమ్ముతున్నారు. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే.. తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం ఈ డ్రైవ్‌ చేపడుతోంది. దీనికింద ఆన్‌లైన్ పేమెంట్ల విలువ రూ.20 లక్షలు (సర్వీస్), రూ.40 లక్షలు (గూడ్స్) దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగాయని, రూ.29 లక్షల జీఎస్టీ కట్టాలని తనకు నోటీసు వచ్చిందని హవేరీ ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి శంకర్‌గౌడ వెల్లడించారు. ఈ డ్రైవ్‌ చిరు వ్యాపారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. దాంతో వారు మళ్లీ నగదు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. నో యూపీఐ బోర్డులను తమ దుకాణాల ముందుంచుతున్నారు. అలాగే ఈ అంశంపై వ్యాపార సంఘాలు జులై 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.

Advertisment
తాజా కథనాలు