BREAKING: విద్యార్థులకు పండగే.. మళ్ళీ పది రోజులు సెలవులు!

కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది.

New Update
srinagar sizzles record heat prompts school timing changes and school holidays

Karnataka: కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది. అయితే కుల గణన సర్వే పనుల్లో  ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  కాగా , సర్వే పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ మేరకు  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య  ఉపాధ్యాయులు సర్వే పనులు పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వ సహాయక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.  దసరా సెలవులు ముగిసి వారం రోజులు కూడా కాకముందే మళ్ళీ పది రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు సంబరపడిపోతున్నారు. 

Also Read: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీతో ప్రశాంత్ కిశోర్ పొత్తు?

పూర్తి కానీ పనులు 

అయితే కర్ణాటకలో జరుగుతున్న ఈ కుల గణన సర్వే అక్టోబర్ 7 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా అనుకున్న సమయంలో పనులు జరగలేదు. కొన్ని జిల్లాల్లో ఉదాహరణకు.. కొప్పుళ ప్రాంతంలో కేవలం 97% సర్వే మాత్రమే పూర్తయింది. అలాగే ఉడిపి, దక్షిణ కర్ణాటక జిల్లాల్లో కేవలం 60%-63 శాతం మాత్రమే పూర్తయింది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ప్రభత్వం 10 రోజుల గడువును పొడిగిస్తూ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవు దినాల్లో ఉపాధ్యాయులు సర్వే పనులు చూసుకుంటారని ఈ నిర్ణయం తీసుకుంది. 

రూ. 20 లక్షల నష్టపరిహారం.. 

ఈ సర్వే పనుల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సిబ్బంది కుటుంబాలకు  ముఖ్యమంత్రి సిద్దిరామయ్య రూ. 20 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే సర్వేలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పాఠశాలలో Mid-term Exams నిర్వహించాల్సిన విధుల నుంచి మినహాయింపు కల్పించారు. ఈ కుల గణన సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల సామజిక, విద్యాపరమైన వివరాలను సేకరించి.. వాటి ఆధారంగా అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలను రూపొందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. 

Also Read: Prashant Kishor : అక్కడి నుంచి పోటీకి సై అంటున్న ప్రశాంత్ కిశోర్.. ఆ సీటు ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు