Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టులో బిగ్ షాక్

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం సమయంలో భారీగా నగదు లభ్యం కావడంతో తీవ్ర వివాదం రేకెత్తింది.

New Update
justice Yashwant Varma

justice Yashwant Varma

Justice Yashwant Varma: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఇంటిలో భారీగా కరెన్సీ కట్టలు లభ్యం కావడంపై అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఆయన్ని పదవి నుంచి తొలగించాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫార్సును జస్టిస్ వర్మ సవాలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వర్మ పనిచేస్తున్న సమయంలో, ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో అక్కడ భారీగా కాలిపోయిన నగదు లభ్యం కావడంతో తీవ్ర వివాదం రేకెత్తింది.

ఈ ఘటనపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ కేసును విచారించి, జస్టిస్ వర్మ దుష్ప్రవర్తనను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని తేల్చింది. ఆయన ఇంట్లోని స్టోర్ రూమ్‌లో దొరికిన నగదు జస్టిస్ వర్శ బాధ్యత కలిగి ఉన్నారని, నగదు లభ్యం కావడానికి సరైన వివరణ ఇవ్వలేదని నివేదికలో పేర్కొంది.

ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి అప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాశారు. దీనిని సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతర్గత విచారణ ప్రక్రియ రాజ్యాంగవిరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మాసిహ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, కొట్టివేసింది. జస్టిస్ వర్మ విచారణలో పాల్గొని, నివేదిక వెలువడిన తర్వాత దానిని సవాలు చేయడం సరైంది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే, ఈ పిటిషన్‌ను విచారించడానికి తగిన ప్రాతిపదిక లేదని పేర్కొంది.

ఈ తీర్పుతో జస్టిస్ వర్మకు ఎలాంటి ఊరట లభించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆయనపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చకు దారితీసింది. ఈ ఘటన దేశ న్యాయ చరిత్రలో ఒక కీలకమైన పరిణామంగా నిలిచిపోనుంది.

Advertisment
తాజా కథనాలు