BREAKING: హేమంత్ సోరెన్ ఘనవిజయం! జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విజయం సాధించారు. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో గెలిపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బీజేపీకి చెందిన గామ్లియెల్ హెంబ్రోమ్‌పై సొరేన్ విజయం సాధించారు. By V.J Reddy 23 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విజయం సాధించారు. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో గెలిపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బీజేపీకి చెందిన గామ్లియెల్ హెంబ్రోమ్‌పై సొరేన్ విజయం సాధించారు. కాగా జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గులాం అహ్మద్ మీర్ వెల్లడించారు. మరోవైపు సీఎం హేమంత్ భార్య కల్పనా సోరెన్ భారీ విజయం సాధించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై కల్పన విక్టరీ సాధించారు. దీంతో ఆమె కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. Jharkhand CM Hemant Soren wins Barhait seat by 39,791 votes, defeats BJP's Gamliyel Hembrom: EC. — Press Trust of India (@PTI_News) November 23, 2024 ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? మ్యాజిక్ ఫిగర్ దాటింది... జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై హేమంత్ సొరేన్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జేఎంఎం కూటమి సిద్ధమైందని అన్నారు. తమపై మరోసారి నమ్మకం పెట్టుకొని అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జేఎంఎం పార్టీ జయకేతనం ఎగరేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 41 మ్యాజిక్ ఫిగర్ దాటుకుని 57 స్థానాల్లో దూసుకుపోయింది. మొత్తం 81 స్థానాలకు గాను.. బీజేపీ 24 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా.. 33 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 16 స్థానాలకే పరిమితమైంది. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పెద్ద హవా కనబరచలేదు. Also Read: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? #jmm #hemant-soren #jharkhand assembly election మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి