జమ్మూకశ్మీర్‌ కొత్త సీఎంగా ఒమార్ అబ్దుల్లా ప్రమాణం.. ఎప్పుడంటే ?

జమ్మూకశ్మీర్‌ కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే.

omar 3
New Update

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్సీ పార్టీ నేత ఒమార్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఖరారయ్యారు. అయితే కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.  

Also Read: హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త!

సొంతంగా మెజార్టీ సాధించిన ఎన్సీ

జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్,బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ 42 స్థానాల్లో గెలవగా,కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి. బీజేపీ 29 స్థానాల్లో గెలవగా.. ముగ్గురు స్వతంత్ర్య అభ్యర్థులు ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. దీంతో బీజేపీ బలం 32కు చేరింది. అలాగే మరో నలుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా ఎన్సీకి మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 46కి చేరింది. దీంతో కాంగ్రెస్ సాయం లేకుండానే ఎన్సీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని దక్కించుకుంది. 

Also Read: ఆ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌కన్‌ కంపెనీలో సీఎం రేవంత్

5 ఏళ్లుగా రాష్ట్రపతి పాలన

ఇక ఈ క్రమంలోనే ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒమర్‌ అబ్దుల్లానే సీఎం అవుతారని ఇటీవల ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఆయనపై ముఖ్యమంత్రి బాధ్యతలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఎన్‌సీ, కాంగ్రెస్ పార్టీలు ఎల్జీకి విజ్ఞప్తి చేశాయి. ఇదిలాఉండగా 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అక్కడ రాష్ట్రపతి పాలనే ఉంది. తాజాగా రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంతో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. 

Also Read: వ్యక్తి ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. చివరికి ఊహించని షాక్

Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్‌ ఫీజు!

 

#telugu-news #jammu-kashmir #Omar Abdullah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe