Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి నివాసం ఖాళీ చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సోమవారం ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు మారారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన 6 వారాల తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 21న అనారోగ్య కారణాలతో ఆయన తన రాజీనామా ప్రకటించారు.

New Update
Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి చత్తర్‌పూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు మారారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ఆరు వారాల తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 21న అనారోగ్య కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా ప్రకటించారు. అప్పటి నుంచి జగ్‌దీప్‌ ధన్‌గడ్ మీడియా ముందుకు రాలేదు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ధన్‌ఖడ్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌హౌస్ ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నాయకుడు అభయ్ చౌతాలాకు చెందినది. ఈ నివాసం తాత్కాలిక ఏర్పాటని, మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో ఆయనకు కేటాయించాల్సిన టైప్-VIII ప్రభుత్వ నివాసం సిద్ధమయ్యే వరకు ఇక్కడే ఉంటారని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతిగా, ధన్‌ఖడ్ నెలకు దాదాపు రూ.2 లక్షల పెన్షన్, టైప్-8 బంగ్లా, వ్యక్తిగత సిబ్బంది, ఇతర సదుపాయాలు అందుతాయి.

కొత్త ప్రభుత్వ నివాసం సిద్ధం కావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, ధన్‌ఖడ్ కుటుంబంతో కలిసి చత్తర్‌పూర్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. ధన్‌ఖడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ, టేబుల్ టెన్నిస్ ఆడటం, యోగా సాధన వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్ రాజీనామా చేసినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో NDA అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్, ప్రతిపక్షాల తరపున మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ధన్‌ఖర్ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కానీ ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది.

Advertisment
తాజా కథనాలు