/rtv/media/media_files/2025/04/23/RTWByPE1LyWFZ8qlLfb9.jpg)
Istanbul Earthquake
మరోసారి భారీ భూకంపం సంభవించింది. ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో ఇళ్లు, షాపుల్లోంచి రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లో భూమి కంపించింది. 6.02 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఇది 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. ఈ భారీ భూకంపంతో భవణాలు కూలిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.
🚨🇹🇷 6.2 EARTHQUAKE SHAKES ISTANBUL
— Mario Nawfal (@MarioNawfal) April 23, 2025
A 6.2 magnitude earthquake hit near Istanbul, centered in the Sea of Marmara.
It gave the city a good shake, but no injuries or damage have been reported so far.
Turkey’s emergency agency is keeping an eye on things.
Source: Associated… pic.twitter.com/z7qNyNZuz9
🇹🇷 6.2 MAGNITUDE EARTHQUAKE STRIKES ISTANBUL
— NEXTA (@nexta_tv) April 23, 2025
‼️The epicenter was located in the Sea of Marmara.
The city shook noticeably, but there have been no reports of casualties or damage so far. pic.twitter.com/tCe0V9GqtM
Istanbul Earthquake
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. భూకంపం ఇస్తాంబుల్‌లోని మర్మారా సముద్రంలో కేంద్రీకృతమై ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ భూకంప తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్థి నష్టం జరగలేదని తెలిసింది.
BREAKING:
— World (@XTheWorldXx) April 23, 2025
6.2 Magnitude Earthquake in Istanbul 🇹🇷 pic.twitter.com/qbe9s1g6QA
A powerful jolt from an earthquake (magnitude 6.2) has shaken the city of #Istanbul.
— Mr B (@MrBeats61134631) April 23, 2025
The earthquake in Istanbul was captured on a shop’s security camera in Üsküdar.#earthquake pic.twitter.com/yReshTB1JT
టర్కీ AFAD విపత్తు సంస్థ ప్రకారం.. ఇటీవలి సంవత్సరాలలో 16 మిలియన్ల జనాభా కలిగిన నగరాన్ని తాకిన బలమైన భూకంపాలలో ఇది ఒకటి. ఇస్తాంబుల్‌కు పశ్చిమాన దాదాపు 80 కి.మీ (50 మైళ్ళు) దూరంలో ఉన్న సిలివ్రి ప్రాంతంలో మధ్యాహ్నం 12:49 (0949 GMT) గంటలకు భూకంపం సంభవించిందని AFAD తెలిపింది. భూకంప కేంద్రం 6.92 కి.మీ (4.3 మైళ్ళు) లోతులో ఉందని AFAD పేర్కొంది.
6.2 Earthquake in Istanbul, Turkey
— Disasters Daily (@DisastersAndI) April 23, 2025
All networks are currently down, people are scared to go back to their homes
There were 6 stronger aftershocks. pic.twitter.com/dnco5ndj3Z
భూకంపాల ప్రభావాన్ని అంచనా వేయడానికి విపత్తు, అత్యవసర నిర్వహణ బృందాలు ప్రక్రియను ప్రారంభించాయని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. ఇక దీని అనంతరం 5.3 తీవ్రతతో అనేక ప్రకంపనలు సంభవించాయి. విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ నివాసితులు భవనాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇక ఈ భూకంపం ఇతర ప్రాంతాలలో కూడా కనిపించిందని నివేదికలు తెలిపాయి. దీంతో చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
earthquake | latest-telugu-news | telugu-news