IRCTC Tour Package: చలికాలంలో IRCTC అదిరే టూర్ ప్యాకేజ్.. సరస్సులు, దేవాలయాలు, కోటలు చూడొచ్చు..!

IRCTC ఉత్తర ప్రాంతం లక్నో నుంచి రాజస్థాన్‌కు "ఉదయపూర్ టు జైసల్మేర్- రాజస్థాన్ హెరిటేజ్ రూట్" పేరిట 6 రాత్రులు/7 రోజులు గల విమాన ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ నవంబర్ 24న ప్రారంభమవుతుంది. పర్సన్‌ బట్టి ధరను నిర్ణయించారు.

New Update
IRCTC Tour Package

IRCTC Tour Package

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దేశవ్యాప్తంగా టూర్ ప్యాకేజీలను అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. సమ్మర్, వింటర్ సీజన్లలో కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకొస్తూ టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. వివిధ మత, పర్యాటక ప్రదేశాలకు రైలు టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. ఇది రైల్ టూర్ ప్యాకేజీలతో పాటు ఎయిర్ టూర్ ప్యాకేజీలను కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే IRCTC తాజాగా మరొక ఎయిర్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

IRCTC Tour Package

IRCTC ఉత్తర ప్రాంతం లక్నో నుంచి రాజస్థాన్‌కు ‘‘ఉదయపూర్ నుండి జైసల్మేర్ - రాజస్థాన్ హెరిటేజ్ రూట్’’ అనే ఎయిర్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉంటుంది. నవంబర్ 24, 2025 టూర్ ప్రారంభం అవుతుంది. ఇందులో పర్యాటకులను ఉదయపూర్, మౌంట్ అబూ, జోధ్‌పూర్, జైసల్మేర్ వంటి గమ్యస్థానాలకు తీసుకెళుతుంది. ఈ పర్యటనలో త్రీ-స్టార్ హోటళ్లలో వసతి, ఫుడ్, కల్పిస్తారు. 

ఈ టూర్‌లో పర్యాటకులు ఉదయపూర్‌లోని సరస్సులు, రాజభవనాలు, మౌంట్ అబూలోని దిల్వారా దేవాలయాలు, జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌గఢ్ కోట, జైసల్మేర్‌లోని థార్ ఎడారి శిబిరాన్ని సందర్శిస్తారు. 

టూర్ ప్యాకేజీ ధర

ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. ఒక వ్యక్తికి ఒక్కొక్కరికి రూ.70,500 ఖర్చు అవుతుంది. ఇద్దరు కలిసి ఉండటానికి ఒక్కొక్కరికి రూ.55,400-, ముగ్గురు కలిసి ఉండటానికి ఒక్కొక్కరికి రూ.52,300, తల్లిదండ్రులతో ఉండే పిల్లల ప్యాకేజీ ధర రూ.48,700- (మంచంతో సహా), మంచం లేకుండా రూ.45,000.

ఈ టూర్ కోసం బుకింగ్‌లు మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని లక్నోలోని ఐఆర్‌సిటిసి నార్తర్న్ రీజియన్ చీఫ్ రీజినల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. పర్యాటకులు లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్న టూరిజం భవన్‌లోని ఐఆర్‌సిటిసి ప్రాంతీయ కార్యాలయంలో కూడా బుక్  చేసుకోవచ్చని తెలిపారు. అలాగే www.irctctourism.com లో ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్‌లు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు 9236391909, 9236367954, 9236391911 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు