Terror Alert: భారత్ లోనూ సిడ్నీ తరహా దాడులు ..నిఘా వర్గాల హెచ్చరిక

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రవాదులుజరిపిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగుల్చాయి. ఇలాంటి దాడులు భారత్ లోనూ జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు కాచుకుని కూర్చొన్నాయని చెబుతున్నాయి. 

New Update
3 Indians abducted amid terror attacks by Al Qaeda outfit in Mali

సిడ్నీ బాండీ బీచ్ లో జరిగిన ఉగ్రదాడితో భారత్ కూడా అప్రమత్తమైంది. అలాంటి దాడులు భారత్ లోనూ జరగవచ్చని భారత నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. త్వరలో కొత్త ఏడాది వేడుకలు రానున్నాయని..వాటిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఐసీస్ ప్రేరేపిత ఉగ్రమూకలు పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకోవచ్చని అలెర్ట్ చేశాయి. సిడ్నీ దాడిని ఉదాహరణంగా చూపి, ఐసిస్ అనుబంధ గ్రూప్‌లు యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో వేర్పాటువాద డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 

న్యూ ఇయర్ వేడుకలకు జాగ్రత్త..

లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు తాజాగా రిక్రూట్ మెంట్లను మొదలుపెట్టాయిని...ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని కూడా తీవ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్లకు ఒక సాధనంగా వాడుకుంటున్నాయని నిఘా సంస్థలు చెబుతున్నాయి. రెండు సంస్థల్లోనూ అగ్ర నాయకులు ఈ మధ్య కాలంలో తరుచుగా కలవడం, ప్లాన్ చేయడం లాంటివి జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. బార్డర్లో కూడా ఉగ్రమూకలు పొంచి ఉన్నాయని, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా..భారత్ లోకి వద్దామా అని చూస్తున్నాయని బార్డర్ సెక్యూరిటీ చెబుతోంది. ఈ క్రమంలో త్వరలో రానున్న కొత్త వేడుకల టైమ్ లో అలెర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా పర్యాటకులు వచ్చే గోవా వంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పోలీసులు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా ముష్కర మూకలు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, కాబట్టి అప్రమత్తత అత్యవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో యూదు, ఇజ్రాయెల్‌కు సంబంధిత ప్రదేశాలపై దాడులు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా యూదుల ప్రార్థనా స్థలాలు, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు, అలాగే యూదు, ఇజ్రాయెల్ సముదాయాలు నివసించే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెబుతున్నారు. ఈ హెచ్చరికలతో పలు నగరాల్లో నిఘాను విస్తరించడంతో పాటు, సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.

Advertisment
తాజా కథనాలు