Infosys: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం పనితీరు ఆధారిత బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ బోనస్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
Also Read: ఒక్కొక్కరికి కోట్లలో.. 'పుష్ప' లో ఈ నటుల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్!
నవంబర్ నెల వేతనంతో పాటు ఈ బోనస్ ను చెల్లించనుంది. సంబంధిత త్రైమాసికంలో ఉద్యోగి పనితీరు, సహకారం ఆధారంగా ఈ బోనస్ చెల్లింపులు ఇవ్వనుంది. బోనస్ చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం. క్యూ2 లో మెరుగైన వృద్దిని నమోదు చేశామని, అందులో ఉద్యోగుల సహాయ సహకారాలు మరువలేనివని ఇన్ఫోసిస్ పేర్కొంది.
Also Read: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్ ఎమోషనల్.. మరీ ఇంత ప్రేమనా!
ఇదే నిబద్ధతను ఉద్యోగులు ముందుముందు కూడా కొనసాగించాలని ఆకాక్షించింది.ఇన్ఫోసిస్ నిర్ణయం ద్వారా డెలివరీ, సేల్స్ యూనిట్ లో పని చేసే మిడ్, జూనియర్ లెవల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందనున్నారని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
Also Read: కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు!
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 6506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆదాయం సైతం 5.1 శాతం వృద్దితో రూ. 40,986 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ది అంచనాలను సైతం 3.75 -4.5 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో బోనస్ ప్రకటించడం గమనార్హం.
Also Read: అమ్మో అమ్మాయేనా.. నన్నే నన్నే చూస్తూ.. కులశేఖర్ కలం నుంచి వచ్చిన హిట్స్ లిస్ట్ ఇదే!
ఇన్ఫోసిస్ లో ఫ్రెషర్లు, టెక్నికల్ లీడర్లుగా ఉన్న వారిని ఈ0-ఈ2 కేటగిరీగా, మిడ్ లెవల్ ఉద్యోగులను ఈ3-ఈ6 ఉద్యోగులకు, ఈ 7 ఆ పైన కేటగిరీకి చెందిన వారిని సీనియర్ లెవల్ ఉద్యోగులకు పరిగణిస్తారు.అయితే ఏ కేటగిరీకి ఎంత చెల్లిస్తున్నది మాత్రం కంపెనీ మెయిల్ లో వెల్లడించలేదు.