Social media influencer : ఇన్‌ఫ్లూయెన్సర్‌ ‘కమల్‌ కౌర్‌’ హత్య..: ఖలిస్థానీల పనేనా?

ఈ మధ్య సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ల చుట్టే  వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కమల్‌ కౌర్‌ భాభీ అలియాస్‌ కాంచన్‌ కుమారి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆమె మృతదేహం పంజాబ్‌లోని బటిండాలో ఒక ఆగివున్న కారులో లభించింది.

New Update
Influencer 'Kamal Kaur' murdered

Influencer 'Kamal Kaur' murdered

Kamal Kaur : ఈ మధ్య సోషల్‌ మీడియా  ఇన్‌ఫ్లూయెన్సర్‌ల చుట్టే  వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది భారతదేశ సున్నిత రహస్యాలను విదేశాలకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటే. మరికొందరు  గేమ్స్‌ అఫ్‌లను ప్రమోట్‌ చేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇదిలా ఉండగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కమల్‌ కౌర్‌ భాభీ అలియాస్‌ కాంచన్‌ కుమారి అనే యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆమె మృతదేహం పంజాబ్‌లోని బటిండాలో ఒక ఆగివున్న కారులో లభించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు.

కమల్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌. అమెకు ఇన్‌స్టాగ్రామ్‌ వెరిఫైడ్‌ ఖాతాలో 3.83 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,351 పోస్టులు చేసింది. దీంతోపాటు ఆమె పలు సోషల్‌ మీడియా వేదికల్లో చురుగ్గా  ఉంటున్నారు. కేవలం 3 పదుల వయసున్న కౌర్  సోషల్‌ మీడియాలో ఘాటైన పదాలతో పోస్టు చేస్తుందన్న ప్రచారం ఉంది. దీంతో ఆమెకు శత్రువులు కూడా ఎక్కువే అంటున్నారు. అంతేకాదు గతేడాది అక్టోబర్‌లో ఆమెకు కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాది అర్ష్‌దల్లా నుంచి బెదిరింపులు వచ్చాయి. కౌర్‌కు వార్నింగ్‌ ఇస్తూ కొన్నిరకాల వీడియోలు పోస్టు చేయడం ఆపేయాలని హెచ్చరించాడు. లేకపోతే వారి కుటుంబసభ్యుల్లో ఒకరిని చంపుతానని కూడా బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేయాల్సిన పని వారికి తప్ప మరెవ్వరికీ లేదన్న ప్రచారం సాగుతోంది.  ఆమె చివరిగా గతమూడు రోజుల కిందట చివరిపోస్టు చేసింది.

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

ఆమె చేసిన పోస్టు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె ముఖంలో విచిత్రమైన హావ భావం కలిగి ఉండి.. ఎర్రగా మారినట్లు కళ్లు.. ఫోటోలో మనకు కనిపిస్తాయి. ఎమోషన్ లేదు, లవ్ లేదు, ఫ..క్ లేదు.. మిగిలి ఉన్నది సందేహం, సందేహం, సందేహం మాత్రమే.. అంటూ పంజాబీ భాషలో ఆమె పోస్టులో రాసుకోచ్చింది. దీని నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిసిస్తున్నారు. ఆమె అలా ఎందుకు ఉందని, ఆమె మృతికి గల కారణాలు తెలపాలని పోలీస్ శాఖను కోరుతున్నారు.

ఇది ఫక్కా ఖలిస్థానీ ఉగ్రవాదుల పనేనని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆమెకు అభిమానులు తప్ప పెద్దగా శత్రువులు లేరని, సోషల్‌ మీడియాలో నచ్చనివారు వార్నింగ్‌ ఇవ్వడం సహాజమేనని వారు ఆరోపణలు చేయడం తప్ప హత్యలు చేసేంత కోపాలు ఉండవని అంటున్నారు. కాగా ఈ విషయమై బటిండా ఎస్పీ నరీందర్‌సింగ్‌ మాట్లాడుతూ ‘‘పోస్ట్‌మార్టం రిపోర్టులో స్పష్టత వస్తుంది. కారు కూడా తప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌తో ఉంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆమె జూన్‌ 9న లూథియానా నుంచి బటిండాలో ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌కు వచ్చారు. ఆ తర్వాత ఆమె నుంచి కుటుంబసభ్యులకు ఎటువంటి సమాచారం రాలేదు’’ అని వెల్లడించారు.  

Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు