Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!

ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

author-image
By Bhavana
New Update
indigo

Indigo Flight : ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. గత వారం జరిగిన సంఘటనకు సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.సెప్టెంబర్ 9న ఇండిగో ఫ్లైట్ నెం. 6E 6054 ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. 

అయితే విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో టెయిల్ సెక్షన్ భారీగా దెబ్బతింది. విమానంపై ఉండే పెయింట్ ఊడిపోయింది. తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఇది తీవ్రమైన ప్రమాదంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేని తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది నిర్మాణాత్మక నష్టానికి దారి తీస్తుంది.

పైలట్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం అందించాడు. ఆ తర్వాత ఏటీసీ ల్యాండ్‌కి క్లియరెన్స్ ఇచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నాయి. రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీజీసీఏ సిబ్బందిని తొలగించింది.

Also Read: Pager Explosion: పేలిన పేజర్లు..పదుల సంఖ్యలో మృతులు…వందల సంఖ్యలో క్షతగాత్రులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు