/rtv/media/media_files/2025/02/28/52JRIYcNjG5zkTG2PKHU.jpg)
India's Q3 GDP Grows By 6.2%
భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 2024 డిసెంబర్ ముగిసేనాటికి మూడో త్రైమాసికంలో (Q3 FY25) 6.2 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలైంది. రెండో త్రైమాసికంలో జీడీపీ 5.4 శాతం నమోదవ్వగా.. ఈసారి 6.3 శాతం పెరగొచ్చని నిపుణులు అంచనా వేశారు. మరికొందరు 5.8 శాతం నుంచి 6.5 శాతం మధ్యలో ఉండొచ్చని తెలిపారు.
Also Read: స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే.. లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) దీనిపై ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం2024-25కి సంబంధించి మూడో త్రైమాసికంలో స్థిరమైన ధరల వద్ద జీడీపీ రూ.47.17 లక్షల కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసికంలో జీడీపీ రూ.44.44 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. మొత్తానికి ఈసారి 6.2 శాతం జీడీపీ పెరిగినట్లు స్పష్టం చేసింది.
Also Read: పేదల పెన్నిధి.. కిలోమీటర్‌కు రూ.1 ఖర్చుతో ఆటోరిక్షాలు లాంచ్!