RRB: రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలివే!

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. NTPCలో 8,875 ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది.

New Update
rrbb

RRB: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. NTPCలో 8,875 ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. వీటిలో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్లకు, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ల పోస్టులున్నట్లు వెల్లడించింది. గ్రాడ్యుయేట్ స్థాయిలో గూడ్స్ గార్డ్‌లకు అత్యధికంగా 3,423 పోస్టులున్నట్లు పేర్కొంది. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921 పోస్టులు), స్టేషన్ మాస్టర్ (615 పోస్టులు) కూడా ఉన్నాయి. 

MMTSలో పలు పోస్టులు..

ఇక గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం జరిగే రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో.. MMTS రైల్వేలలో సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (638), చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ (161), ట్రాఫిక్ అసిస్టెంట్ (59) పోస్టులను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ (12వ తరగతి ఉత్తీర్ణత) అభ్యర్థులకు అత్యధిక సంఖ్యలో ఖాళీలు కమర్షియల్-కమ్- టికెట్ క్లర్క్ (2,424) ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (394), జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (163), ట్రైన్స్ క్లర్క్ (77) ఖాళీలు కూడా ఉన్నాయి. నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇడబ్ల్యుఎస్ వర్గాలకు రిజర్వేషన్ నియమాలను సక్రమంగా అమలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్‌లు, యూనిట్‌లను ఆదేశించింది.

ఎలా దరఖాస్తు చేయాలి:

- అధికారిక వెబ్‌సైట్ www.rrbcdg.gov.in ని సందర్శించండి .
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న హైలైట్ చేయబడిన లింక్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీ ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
- మీ వ్యక్తిగత వివరాలు, విద్య, వివిధ ఖాళీలను పూరించండి.
- నిబంధనల ప్రకారం మీ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
- మీ రికార్డు కాపీని సేవ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
- సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10 వరకు ధరఖాస్తు చేసుకోవాలి.

ఇది కూడా చూడండి: IND VS PAK: ఆపరేషన్ సిందూర్ మళ్ళీ సక్సెస్.. టీమ్ ఇండియా విక్టరీపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

దరఖాస్తు రుసుము ఎంత ఉంటుందో చూసి చెల్లించండి. 
RRB NTPC 2025 దరఖాస్తు రుసుము కేటగిరీ ప్రకారం మారుతుంది. జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ. 500 ఉంటుంది.
SC, ST, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికుల అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి.

RRB NTPC 2025 పరీక్షా సరళి
- పరీక్ష రెండు దశల్లో నిర్వహించబడుతుంది:

CBT-1 (స్క్రీనింగ్ టెస్ట్):
మొత్తం ప్రశ్నలు: 100
జనరల్ అవేర్‌నెస్: 40
మ్యాథమెటిక్స్: 30
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30
వ్యవధి: 90 నిమిషాలు
నెగటివ్ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కటాఫ్.

ఇది కూడా చూడండి: ఆసియాకప్ విజయం.. టీమ్ ఇండియాకు BCCI భారీ నజరానా!

CBT-2 (పోస్ట్-స్పెసిఫిక్ టెస్ట్):
మొత్తం ప్రశ్నలు: 120
జనరల్ అవేర్‌నెస్: 50
మ్యాథమెటిక్స్: 35
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 35
వ్యవధి: 90 నిమిషాలు
నెగటివ్ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కటాఫ్.

Advertisment
తాజా కథనాలు