Prashant Tamang : గుండెపోటుతో ఇండియన్ ఐడల్ 3 విన్నర్ ప్రశాంత్ కన్నుమూత

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్-3 విన్నర్ ప్రశాంత్ తమాంగ్ (43) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీ, జనక్ పురిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ మరణాన్ని ఆయన స్నేహితుడు, ఇండియన్ ఐడల్ కో కంటెస్టెంట్ భవేన్ ధనాక్ ధ్రువీకరించారు.

New Update
FotoJet - 2026-01-11T172446.426

Indian Idol 3 winner Prashant passes away due to heart attack

Prashant Tamang : ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్-3 విన్నర్ ప్రశాంత్ తమాంగ్ (43) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీ, జనక్ పురిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది.ప్రశాంత్ మరణాన్ని ఆయన స్నేహితుడు, ఇండియన్ ఐడల్ కో కంటెస్టెంట్ భవేన్ ధనాక్ ధ్రువీకరించారు. అకస్మాత్తుగా ప్రశాంత్ ఈ లోకాన్ని వీడటం తమను షాక్‌కు గురి చేసిందని చెప్పారు.  ప్రశాంత్ సింగర్ గానే కాకుండా, నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1983లో డార్జిలింగ్ లో జన్మించిన ప్రశాంత్.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయాడు.

 ప్రశాంత్‌ మొదట పశ్చిమ బెంగాల్‌ పోలీస్‌ శాఖలో పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం పొందాడు. కోల్ కతాలో పని చేస్తూనే సంగీతంపై ఆసక్తి పెంచుకుని, గాయకుడిగా ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో 2007లో వచ్చిన ఇండియన్ ఐడల్-3 అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. దీంతో గాయకుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత సింగర్ గా రాణించాడు. సినిమాలతోపాటు ప్రైవేటు ఆల్బమ్స్ కూడా పాడాడు. ఇండియాతోపాటు నేపాల్ సినిమాల్లోనూ నటించాడు. ఇండియాలో పాతాళ లోక్ సీజన్2లో కనిపించాడు. త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ మూవీ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ లో కూడా నటించాడు. అయితే . ప్రశాంత్ కొంతకాలంగా ఢిల్లీలో ఉంటున్నారని ఆయన స్నేహితులు తెలిపారు. ప్రశాంత్‌  గుండెపోటుతో మరణించినట్టు అనుకుంటున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాగా ప్రశాంత్‌ కు భార్య, ఒక కూతురు ఉన్నారు.  

నేపాలీ గోర్ఖా సంతతికి చెందిన ప్రశాంత్ ఇండియన్‌ ఐడల్‌ సక్సెస్ ను నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. ప్రశాంత్ తమాంగ్ మరణంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. అతడి మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇండియన్‌ ఐడల్‌ షోలో రాణించడంతో పాటు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారని తెలిపారు. డార్జిలింగ్‌కు చెందిన ప్రశాంత్ పోలీసు శాఖలో కూడా పనిచేసి రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంఘీభావం తెలిపారు. కాగా ప్రశాంత్‌ గుర్ఖాల సంస్కృతికి అద్దం పట్టేలా ఆయన పాడిన కొన్ని పాటలకు విపరీతమైన పాపులారిటీ లభించింది.

Advertisment
తాజా కథనాలు