/rtv/media/media_files/2024/11/25/WW0sKrPCSmxiFJtueoyq.jpg)
iPhone Users: దేశంలో యాపిల్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఆ సంస్థకు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు పంపింది. ఆయా సాఫ్ట్‌వేర్లలో లోపాలున్నాయని, అనధికారికంగా డేటాను తస్కరించే వీలుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. హ్యాకర్లు దీనిని తమకు అనువుగా మార్చుకునే వీలుందని, అందువల్ల జాగ్రత్త పడాలని హెచ్చరికలు చేసింది. కాగా సెక్యూరిటీ టాప్ లో ఉండే యాపిల్ కంపెనీకి చెందిన ఫోన్లు కూడా హ్యాక్ అవ్వడం ఆందోళన కలిగించే అంశం.
Also Read: Pushpa2 స్టేజీపైనే నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్
ఈ వెర్షన్ ఐఫోన్లకే ముప్పు...
* యాపిల్ ఐవోఎస్, ఐపాడ్ ఓఎస్‌లలో 18.1.1కి ముందు వెర్షన్లు.
* యాపిల్ ఐవోఎస్, ఐపాడ్ ఓఎస్‌లలో 17.7.2 ముందు వెర్షన్లు
* యాపిల్ మ్యాక్‌ఓఎస్ సుక్వోయా 15.1.1 వెర్షన్లకు ముందువి
Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!
* యాపిల్ విజన్ ఓఎస్ వెర్షన్ 2.1.1కు ముందువి
* యాపిల్ సఫారీ వెర్షన్ 18.1.1 ముందువి వాడేవారు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు
అయితే ఈ వెర్షన్ వాడే యూజర్లు వెంటనే తన IOS ను అప్డేట్ చేసుకోవాలనిన్ సూచనలు చేసింది. లేదంటే వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నేళ్లుగా కేంద్రం తరచూ యాపిల్ ఫోన్ల సెక్యూరిటీ విషయంలో వినియోగదారులకు హెచ్చరికలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇలాంటిదే జారీ ఒకటి జారీ చేసింది. అలాగే ఆగుస్ట్ నెలలో కూడా కేంద్రం యాపిల్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. నాడు ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్ల, సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్ సొనోమా 14.4.1, యాపిల్ విజన్ ఓఎస్ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు కేంద్రం పేర్కొంది.
Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!