INDIA : ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ

ఇండియా కూటమిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుండగా.. ఆ పగ్గాలు టీఎంసీకి అప్పగించాలనే వాదనలు మొదలయ్యాయి. దీంతో దీదీకి సపోర్ట్ చేసే పార్టీలు పెరుగుతుండగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

New Update
11

INDIA: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు గతేడాది ఏర్పడిన ఇండియా కూటమికి ముందు నుంచి కూడా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు రాకుండా, సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయడంలో ఇండియా కూటమి అయితే విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు.

Also Read: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

అదే సమయంలో మరిన్ని సీట్లు వస్తే అధికారాన్ని దక్కించుకునే వరకు కూడా వెళ్లింది. అయితే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కలిసికట్టుగా పోరాడలేదని..ఐక్యంగా పోరాడితే ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండేవని రాజకీయ విశ్లేషకులు కూడా అన్నారు.

Also Read: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

 దీంతో ఇండియా కూటమిలో ఉన్న లుకలుకలు కాస్తా.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరాయి. ఇక మెజార్టీ పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం వహించడం పై పార్టీల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది టీఎంసీ వల్లే సాధ్యం అని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు అంటున్నారు.

 అందుకే ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ పేరును ప్రకటించాలని వారు అంటున్నారు. ఇక ఇండియా కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని స్వయంగా మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినపడుతున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

ఇక సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు దీదీకి పూర్తి మద్దతినిస్తున్నాయి. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్ననట్లు సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ ప్రతినిధి ఉదయ్‌వీర్‌ సింగ్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి టీఎంసీ గట్టి పోటీని ఇస్తోందని.. కమలం పార్టీని నిలువరించడంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందని వివరించారు.

ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే తీవ్ర విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. ఇండియా కూటమికి బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సరైన లీడర్ అవుతారని ఆ పార్టీ తెలిపింది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాల మాట విన్నట్లయితే ఎన్నికల ఫలితాలు వేరేగా ఉండేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి అయితే తెలుస్తుంది.. మమతా బెనర్జీ చెప్పినట్లు ఆమె పార్టీ నడుస్తుందని.. అదే విధంగా తాము కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలనే పాటిస్తామంటూ హస్తం పార్టీ వెల్లడించింది. 

ఇక ఇండియా కూటమిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్‌ రౌత్ తెలిపారు. ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ కానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ గానీ, శివసేన పార్టీ నేత గానీ ఎవరు ఉన్నా తామంతా కలిసే ఉంటామని తెలిపారు. అంతేకాకుండా ఇదే విషయం పై మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు త్వరలోనే కోల్‌కతా వెళ్లనున్నామని సంజయ్ రౌత్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు