Operation Sindoor : పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై అంత కచ్చితంగా దాడులు ఎలా చేశారంటే!

9 ఉగ్రస్థావరాలపై భారత్ గురితప్పకుండా కచ్చితత్వంతో దాడి చేసింది. ఇందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు  చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ పాటు లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ ను వాడింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాలు కోఆర్డినేట్స్ ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చింది.

New Update
attack pak

attack pak

పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్‌. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్,   పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఉగ్రవాద స్థావరాలపై పెద్ద దాడి చేసింది. 9 ఉగ్రస్థావరాలపై భారత్ సిస్టమ్స్ గురితప్పకుండా కచ్చితత్వంతో దాడి చేసింది. ఇందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు  చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ పాటు లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ ను వాడింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాలు కోఆర్డినేట్స్ ను  ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇవ్వగా భారత భూభాగం నుంచే దాడులు చేసింది. టార్గెట్ లొకేషన్ ను  అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ సాయపడుతుంది.  పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించిన తరువాత ఈ ప్రతీకార దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని భారత్ ఇప్పటికే హెచ్చరించింది. 

operation Sindoor | pakistan | india | telugu-news 

Advertisment
తాజా కథనాలు