IND-PAK War: ఆ విషయంలో తగ్గేదే లేదు.. యుద్ధం ఆపడానికి భారత్ పెట్టిన కండీషన్లు ఇవే!

కాల్పుల విరమణ ఆగినా.. సింధు నది జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేస్తోంది. ఇంకా పాకిస్తాన్‌ పౌరుల వీసాల రద్దు నిర్ణయం కూడా వెనక్కి తీసుకోబోమని తేల్చి చెబుతోంది. అన్ని రకాల వ్యాపారం, వాణిజ్యంపైనా నిషేధం ఉంటుందని సమాచారం.

New Update

అమెరికా రంగంలోకి దిగి చర్చలు జరపడంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఇండియా షరతుల ప్రకారమే కాల్పుల విరమణ జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ కోసం మొదట పాకిస్తాన్ ఇండియాను సంప్రదించింది. ఇందుకోసం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు పాకిస్తాన్ ISI చీఫ్‌ కాల్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కాల్పుల విరమణ జరిగినా పాకిస్తాన్ పై ఒత్తిడి కొనసాగుతుందని భారత్ స్పష్టం చేస్తోంది. పాక్‌ ఏ చిన్న తప్పు మళ్లీ చేసినా యుద్ధం మొదలు అవుతుందని తేల్చి చెబుతోంది.

అమల్లోనే సంధూ జలాల ఒప్పందం..

సింధు నది జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా.. పాకిస్తాన్‌ సోషల్‌మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లపైనా నిషేధం కంటిన్యూ అవుతుందని సమాచారం. పాకిస్తాన్‌ పౌరుల వీసాల రద్దు నిర్ణయం కూడా వెనక్కి తీసుకోబోమని ఇండియా తేల్చి చెబుతోంది. పాకిస్తాన్‌తో అన్ని రకాల వ్యాపారం, వాణిజ్యంపైనా నిషేధం కొనసాగుతుందని సమాచారం. 

పాకిస్తాన్ విమానాలకు గగనతల నిషేధం కూడా కొనసాగుతుందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రచర్యనైనా యుద్ధంగానే భావిస్తామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరపబోం అని భారత్‌ స్పష్టం చేస్తోంది. 

(india operation sindoor | telugu-news | telugu breaking news)

Advertisment
తాజా కథనాలు