/rtv/media/media_files/2025/02/08/rbKOpKWf1uY2FmAqOnra.jpg)
Delhi CM Sentiment
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఆప్ ను నామరూపాల్లేకుండా బీజేపీ తుడిచిపెట్టేసింది. కేజ్రీవాల్ నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు అందరూ బీజేపీ అభ్యర్థుల చేతుల్లో ఘోర పరాజయం పొందారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ 4 వేల ఓట్లతో ఓడించారు. అయితే బీజేపీ ఇప్పటి వరకు తన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది చెప్పలేదు. ఇదే సస్పెన్స్ తో ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో గెలిచింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎవరిని సీఎం చేస్తారనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సెంటిమెంట్ విషయం కూడా తెర మీదకు వచ్చింది.
ఢిల్లీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి, అది నిర్వర్తించిన అభ్యర్థులకు ఓ సెంటిమెంట్ ఉంది. ఇప్పటికి దాదాపు 30 ఏళ్ళుగా..ఇదే వర్కౌట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు దీని ప్రకారమే బీజేపీ నుంచి కాబోయే సీఎం అతనే అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అదేంటి, అతనెవరూ అంటే.. ఆప్ అధినేత కేజ్రీవాల్ కన్నా ముందు కాంగ్రెస్ నేత షీటా దీక్షిత్ ఢిల్లీకి 26 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఆమె తరువాత కేజ్రీవాల్ పదేళ్లు ఈ పీఠాన్ని తన సొంతం చేసుకున్నారు. ఈయన 10 సంవత్సరాల 25 రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ పార్టీ నుంచి ఒకరు సీఎంగా ఎన్నికవనున్నారు.
అయితే ఇంతకు ముందు సెంటిమెంట్ ప్రకారం చూస్తే..న్యూ ఢిల్లీ నుంచి గెలిచిన పర్వేశ్ వర్మనే సీఎం అవుతారని చెబుతున్నారు. ఎందుకంటే ఢిల్లీకి 26 ఏళ్ళు సీఎంగా ఉన్న షీలా దీక్షిత్, ఆ తరువాత పదేళ్లు ఉన్న కేజ్రీవాల్ ఇద్దరూ న్యూ ఢిల్లీ నుంచి ఫోటీ చేసిన వారే. షీలా దీక్షిత్ ను ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పీఠాన్ని తన హస్తగతం చేసుకున్నారు. ఇక్కడ మరో అంశం పార్టీ కూడా మారింది. షీలా దీక్షిత్ కాంగ్రెస్ అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి. ఇప్పుడు కేజ్రీవాల్ ను బీజేపీ నుంచి పోటీ చేసిన సరవేశ్ అదే న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఓడించారు. సో లెక్క పక్రారం...అతనే నెక్ట్స్ ఢిల్లీ సీఎం అని చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీలో బీజేపీ గెలుపు ఖాయం అయినప్పటి నుంచి పర్వేశ్ వర్మ తెగ సంచలనం అవుతున్నారు. జెయింట్ కిల్లర్ అంటూ అతని పేరు హోరెత్తిపోతోంది. ముఖ్యంగా బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్స్ గా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నారు. కూలాశ్ గహ్లోత్, రమేశ్ భిదూరి, పర్వేశ్ వర్మ వీళ్ళు ముగ్గురిలో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తారని చెబుతున్నారు. అందరికంటే పర్వేశ్ మీదనే ఎక్కువ అంచనాలున్నాయి.
Also Read: Delhi Elections: కేజ్రీవాల్ ను ఓడించిన కాంగ్రెస్.. షాకింగ్ లెక్కలివే!