New variant of Corona: కరోనా కొత్త వేరియంట్‌పై ICMR కీలక ప్రకటన

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి DHR, ICMR, NCDC డైెరెక్టర్లతో సమావేశమైయ్యారు. ఇండియాలో కోవిడ్ కేసుల పెరుగుదల నిషితంగా పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్ కేసుల్లో చాలా వరకు తేలికపాటివేనని తెలిపారు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని ICMR చెప్పింది.

New Update
Health News: కరోనా బాధితులకు షాకింగ్‌ న్యూస్.. వెంటనే డాక్టర్‌ను కలవండి!

మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ కేసులు కలవర పెడుతున్నాయి. గతకొన్ని రోజులుగా JN.1 అనే వేరియంట్ కేసులు ఇండియాలో పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రా్ల్లో కేసులు నమోదైయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్స్‌తో శనివారం సమీక్షించారు. 

కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదయ్యాయి. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMRలు దేశవ్యాప్తంగా ఇండియా రెస్పిరేటరీ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్‌వర్క్ ద్వారా కోవిడ్-19తో సహా శ్వాసకోశ వ్యాధుల పర్యవేక్షణ కోసం పటిష్ఠమైన సిస్టమ్ ఉందని తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్ కేసుల్లో చాలా వరకు తేలికపాటివేనని, పేషెంట్లు హోమ్ క్వారెంట్‌లో ఉన్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉందని, కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. INSACOG డేటా ప్రకారం భారతదేశంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసు ఒకటి NB.1.8.1 వేరియంట్, నాలుగు LF.7 కేసులు గుర్తించారు. అనేక రాష్ట్రాల్లోని అధికారులు మే 24 (శనివారం)నాటికి మరిన్ని కేసులను నివేదించారు.

ఇండియాలో అత్యంత సాధారణ వేరియంట్ JN.1గా ఉంది. టెస్ట్ చేసిన వారిలో 53 శాతం పాజిటివ్ వస్తుంది. తరువాత BA.2 (26 శాతం), ఓమిక్రాన్ సబ్‌లైనేజ్‌లు (20 శాతం) ఉన్నాయని INSACOG తెలిపింది. 2025 మే నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ LF.7, NB.1.8 సబ్‌వేరియంట్‌లను వేరియంట్‌లు అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. ఇవి చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో COVID కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్లని WHO చెప్పింది.

Covid New Variant | covid new variant in india | covid new variant jn1 | covid-jn-1 | corona-jn1-symptoms | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు