కర్ణాటకలో HMPV కలకలం.. మొత్తం రెండు కేసులు!

కర్ణాటకలో ఈ రోజు ఉదయం తొలి HMPV కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే.. మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల పాపకు కూడా వైరస్ సోకినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

New Update
HMPV virus india

HMPV virus

చైనాలో కలకలం  సృష్టిస్తోన్న హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి కూడా ఎంటర్ అయింది.  కర్ణాటకలో 2025 జనవరి 06వ తేదీన రెండు కేసులు నమోదయ్యాయి.  ఈ విషయాన్ని  ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించింది. ఈ చిన్నారులకు సంబంధించి ఎవరూ కూడా విదేశాల నుంచి ఇండియాకు వచ్చినట్లుగా కూడా లేదు.  హెచ్‌ఎంపీవీ కేసులు ఇండియాలో నమోదు కావడం అందరిని షాక్ కు గురిచేసింది.  అయితే ఈ సంఖ్య ఇంతటితో ఆగిపోతుందా? లేక కేసుల సంఖ్య పెరుగుతుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

 మరోవైపు చైనాలో  హ్యూమన్ మెటానిమోవైరస్‌ విజృంభిస్తున్న వేళ.. భారత్ అలెర్ట్ అయింది.   ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ సమావేశం నిర్వహించింది. అయితే చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ తేల్చింది.  అయితే ఇండియాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  పేర్కొంది. 

Also Read :  కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

HMPV లక్షణాలు ఇవే 

ఈ హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు.  

Advertisment
తాజా కథనాలు