/rtv/media/media_files/2025/05/29/2si5j6W5YSmcvKHs6M4C.jpg)
Indian human smuggler
Indian Human Smuggler: మూడేళ్ళ క్రితం హర్షకుమార్ పటేల్ అలియాస్ ‘డర్టీ హ్యారీ’కి వ్యక్తి విద్యార్థులు వీసాలపై అక్రమంగా భారతీయులను అమెరికా తరలిస్తున్న కేసులో అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ ముఠా పై విచారణ జరిపిన అమెరికా న్యాయస్థానం డర్టీ హ్యారీని దోషిగా తేలుస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముందుగా కెనడాకు రప్పించి.. ఆ తరవాత అక్కడి నుంచి వారిని అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి
Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌కి శిక్ష ఏంటో తెలుసా?
గుజరాతీ కుటుంబం మృతి
ఇలాగే 2022లో ఓ గుజరాతీ కుటుంబంతో పాటు మరో ఏడుగురు భారతీయులను అక్రమంగా అమెరికా సరిహద్దు దాటించేందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో విపరీతమైన మంచు కురవడంతో గుజరాతీ కుటుంబం మంచులో కూరుకుపోయి చనిపోయారు. మిగతా ఏడుగురు నడుచుకుంటూ అమెరికా సరిహద్దు దాటారు. ఆ తర్వాత అక్కడ ఈ ముఠాకి చెందిన మరో వ్యక్తి షాండ్‌ను కలుసుకున్నారు. కానీ, షాండ్ వారిని తీసుకొని వెళ్తుండగా భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అప్పుడు షాండ్ ని విచారించగా 'డర్టీ హ్యారీ' వ్యవహారం బయటపడింది.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
Also Read: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!