AI Helped : ట్రక్కుతో గుద్ది పారిపోయాడు.. AI పట్టించింది.. ఎలా అంటే?

నాగ్​పూర్​లో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ ను ఏఐ సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. కేవలం 36 గంటల్లో  700 కిలోమీటర్ల దూరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
ai helped

నాగ్​పూర్​లో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ ను ఏఐ సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. కేవలం 36 గంటల్లో  700 కిలోమీటర్ల దూరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఆగస్టు 10న ఈ ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్-జబల్పూర్ హైవేపై రాఖీ పండగ రోజున  బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య గ్యార్సి యాదవ్ (30) అక్కడికక్కడే మరణించింది, ఆమె భర్త అమిత్ (35) గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత అమిత్ సహాయం కోసం ఎంతగా వేడుకున్నా ఎవరూ ఆగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆయన తన భార్య మృతదేహాన్ని స్కార్ఫ్ సాయంతో బైకుకు కట్టేసి ఇంటికి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలనం.. రాహుల్‌ గాంధీకి సపోర్ట్

పోలీసులు కేసు నమోదు

ఈ ఘటనపై నాగ్‌పూర్  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో  తమ ప్రత్యేక ఏఐ టూల్ 'MARVEL' (Maharashtra Advanced Research and Vigilance for Enhanced Law Enforcement) సహాయం తీసుకున్నారు. పోలీసులు ప్రమాదం జరిగిన సమయం ఆధారంగా సమీపంలోని మూడు టోల్ ప్లాజాల నుంచి దాదాపు నాలుగు గంటల సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఈ ఫుటేజీని రెండు ఏఐ అల్గారిథమ్స్ సహాయంతో విశ్లేషించారు. 

ఈ రెండు అల్గారిథమ్‌ల విశ్లేషణల ఆధారంగా ఒక ట్రక్కును ఏఐ గుర్తించింది. ఆ ట్రక్కు నెంబర్, రూట్ వివరాలను పోలీసులు సేకరించారు. ఆ తర్వాత ఆ ట్రక్కు ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన సత్యపాల్ రాజేంద్ర (28)దిగా గుర్తించారు. పోలీసులు అతన్ని 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాలియర్-కాన్పూర్ హైవేపై అరెస్టు చేసి, ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్లిష్టమైన కేసును తక్కువ సమయంలో పరిష్కరించిన విధానం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 

మహారాష్ట్రలో దేశంలోనే తొలిసారిగా పోలీస్ డిపార్ట్‌‌ మెంట్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అవసరాల కోసం ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీ విభాగాన్ని ప్రవేశపెట్టారు.

Advertisment
తాజా కథనాలు