JAMMU & KASHMIR: కేంద్రం సంచలన నిర్ణయం.. ‘మళ్లీ రాష్ట్రంగా మారనున్న జమ్ముకశ్మీర్’

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును హోమంత్రి అమిత్ షా బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్, లడఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి.

New Update
JAMMU  KASHMIR REORGANISATION

JAMMU & KASHMIR REORGANISATION

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును హోమంత్రి అమిత్ షా బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. అయితే, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఈ బిల్లు లోక్ సభలో చర్చకు వచ్చిన తర్వాత ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తిరిగి లభిస్తుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం తరచుగా సమీక్షలు నిర్వహిస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయితే, ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2024లో జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కానీ అప్పటికీ అది కేంద్ర పాలిన ప్రాంతంగానే ఉంది. ఆ ఎన్నికల్లో ఓమర్ అబ్ధుల్లా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడం, తిరిగి శాసనసభ ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు గతంలో అనేకసార్లు పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ తిరిగి పుంజుకుంటుంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు గొప్ప ఊరటనిస్తుంది. రాష్ట్ర హోదా కల్పనతో స్థానికులకు మెరుగైన అభివృద్ధి, పాలన లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద, జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును మార్చగల ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు