Israel: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!

నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది.నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్‌ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరూ అనుకున్నారు. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్‌ మరణించినట్లు మీడియా పేర్కొంది.

Israel
New Update

నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!ఇజ్రాయెల్ చేతిలో హిజ్బుల్లాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత హసన్‌ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్‌ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్‌ మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Also Read : వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి

Israel

తాజాగా ఇజ్రాయెల్ దళాలు కూడా ఈ వార్తను ధృవీకరించాయి. ఈ విషయంపై ఐడీఎఫ్‌ అధికారిక ప్రకటన తాజాగా విడుదల చేసింది.
"మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతి, జిహాద్ కౌన్సిల్ సభ్యుడు హషీమ్ సఫీద్దీన్ చనిపోయాడు .అతనితో పాటు హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్‌ హజిమా,ఇతర కమాండర్లు కూడా మృతి చెందినట్లు ధృవీకరించాం,"అని ఐడీఎఫ్‌ తెలిపింది.

Also Read :  నేడు గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన

అదే సమయంలో దాడి ప్రాంతంలో 25 మందికి పైగా హెజ్‌బొల్లా మిలిటెంట్లు ఉన్నట్లు ఏరియల్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. లెబనాన్‌లోని దాహియాలో ఉన్న ఓ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో హషీమ్‌ సమావేశం నిర్వహించారన్న సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడులు చేపట్టింది.ఈ దాడుల్లో లెబనీస్ గూఢాచార విభాగం అధిపతి హుస్సేన్‌ అలీ హజిమా,సఫీద్దీన్ మరణించారని అంతర్జాతీయ మీడియా  తెలిపింది.

Also Read :  భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా!

తాజాగా ఐడీఎఫ్‌  ఈ విషయాన్ని  ధృవీకరించింది. కానీ హెజ్‌బొల్లా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సఫీద్దీన్‌ హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా,జిహాద్‌ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.  2017లో సఫీద్దీన్‌ను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా పగ్గాలు ఆయనకే ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన మరణించడం గమనార్హం.

Also Read :  హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

#israel #hezbollah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe