Mumbai: ముంబైను ముంచెత్తిన వర్షాలు.. వాతారణశాఖ రెడ్ అలెర్ట్

ఈరోజ సాయంత్రం కురిసిన వర్షాలకి ముంబై నగరం మునిగిపోయింది. వరదలతో రోడ్లన్నీ నిండిపోయాయి. చాలా విమానాలను దారి మళ్లించారు. ముంబైలో రేపు స్కూళ్ళకు, కాలేజీలకి సెలవు ప్రకటించారు. 

author-image
By Manogna alamuru
New Update
rains

Mumbai Rains: 

దేశ రాజ ఆర్ధిక రాజధాని ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. భారీ వర్షాలు ఆ నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తాయి. దాంతో పాటూ వరదలు కూడా పోటెత్తాయి. రోడ్ల మీద మోకాళ్ళ లోతు నీళ్ళు నిలిచిపోయాయి. దీంతో అక్కడి జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటూ రేపు, మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరించింది. ముంబైకి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 

ముంబై వర్షాల కారణంగా విజబలిటీ సరిగ్గా లేక చాలా విమానాలు దారి మళ్లించారు. స్పైస్ జెట్, విస్తారా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో పాటూ పలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి గడుస్తున్నా ఇంకా చేరవసి వారు రోడ్ల పైనే ఉండిపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముంబైలో రేపు స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. 

Also Read: మహాలక్ష్మి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని హత్య–తరువాత ఆత్మహత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు