మహాలక్ష్మి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని హత్య–తరువాత ఆత్మహత్య

బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్య వెనుక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫీసులో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే నిందితుడు ముక్తిరంజన్ ఆమెను దారుణంగా చంపాడని తెలుస్తోంది. మహాలక్ష్మిని చంపాక రంజన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

author-image
By Manogna alamuru
New Update
bengaluru

Mahalakshmi Murder Case: 

బెంగళూరుకు చెందిన మహలక్ష్మిని ముక్తి రంజన్ కొన్ని రోజుల క్రితం అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తరువాత ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచి అక్కడ నుంచి పరారయ్యాడు. ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ వెంటనే తన సొంత ఊరుకు పారిపోయాడు. ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు నిందితుడు ఎవరు, అతని ఆచూకీ అన్ని పట్టుకోగలిగారు. ముక్తి రంజన్‌ను అరెస్ట్ చేసేందుకు ఒడశాకు వెళ్ళి గాలించారు కూడా. ఈ క్రమంలో నిందితుడు కూలేపాడు అనే ఊరిలో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. 

హతురాలు మహాలక్ష్మి, నిందితుడు ముక్తి రంజన్ ఒకే చోట పని చేస్తున్నారు. మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్‌గా ఉన్నారు. వీరిద్దరు చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే మహాలక్ష్మి  ఆఫీసులోనే మరొక వ్యక్తితో చనువుగా ఉంటోంది అన్న అనుమానం ముక్త రంజన్‌లో మొదలైంది. ఇద్దరూ ఆఫీసులో తరుచూ కలిసి కనిపిస్తుండడంతో ఈ అనుమానం మరింత బలపడింది. ఈ విషయంలో ఇద్దరూ కాస్త గొడవ పడినట్టు కూడా తెలుస్తోంది. అయితే ముక్తి రంజన్‌కు మహాలక్ష్మి విషంలో ఇది అస్సలు భరించలేని విషయంగా మారింది. చివరకు ఆమెను హత్య చేసేంత వరకూ వెళ్ళింది. మరొక వ్యక్తితో చనువుగా ఉందన్ కారణంగానే  ముక్తి రంజన్...మహాలక్ష్మిని చంపాడని పోలీసులు చెబుతున్నారు. 

Also Read: AP: ఏపీలో 16మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

Advertisment
తాజా కథనాలు